మహాశివరాత్రి పండుగను హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు

దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివ నామ స్మరణతో మారు మోగిపోతాయి.

ఈ సారి మహాశివరాత్రికి ఓ ప్రత్యేకత ఉండటమేకాక.. ఎంతో విశిష్టమైనది అంటున్నారు పండితులు.

ఈ సారి శివరాత్రి శనివారం.. అందునా శని త్రయోదశి నాడు వచ్చింది.

దాంతో ఈ సారి శివరాత్రి చాలా విశిష్టమైనది అంటున్నారు పండితులు.

శనిత్రయోదశి నాడు రావడంతో.. ఈ సారి కొన్ని రాశులపై శివ అనుగ్రహాం దండిగా ఉంటుంది అంటున్నారు.

మూడు రాశుల వారికి శివానుగ్రహం లభించబోతుందని.. వారు దశ తిరుగుతుందని అంటున్నారు పండితులు.

ఆ రాశులు ఏవంటే.. మేషం, కర్కాటకం, ధనస్సు. శివరాత్రి నుంచి ఈ 3 రాశులకు కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

మహాశిరాత్రి నుంచి మేష రాశి వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉండటమే కాక.. ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని.. కొత్త ఆదాయ వర్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి అంటున్నారు.

శివరాత్రి నుంచి కర్కాటక రాశి వారికి వ్యాపారంలో పురోగతి ఉంటుందని.. ఉద్యోగంలో ప్రమోషన్స్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

శివరాత్రి నుంచి అదృష్టం వరించబోయే మరో రాశి ధనస్సు.

శివరాత్రి నుంచి ఈ రాశి జాతకులు ఆరోగ్యం మెరుగుపడటమే కాక.. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంటున్నారు.

శివరాత్రి నుంచి ధనస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా అవ్వడమే కాక వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది అంటున్నారు.