తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి గుడి గురించి తెలియని హిందువులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.

మధురైలోని అరుల్‌మిగు మీనాక్షి సుందరేశ్వర్‌ గుడిలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. 

అందుకే ఈ గుడి మధురై మీనాక్షి గుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 

ఈ గుడి చాలా ప్రత్యేకమైనది.. ఎన్నో విశిష్టతలు కూడా కలిగిఉంది. 

ఈ గుడి గోపురం చాలా ప్రత్యేకమైనది. దీనిపై 33 వేలకుపైగా శిల్పాలు చెక్కబడ్డాయి. 

మెజిస్టిక్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. 

గుడిలో వెయ్యి స్తంభాల మండపం ఉంది.

గుడి సమీపంలో గోల్డెన్‌ లోటస్‌ పాండ​ ఉంది. 

ఈ కొలనులో పూసే తామరలు బంగారు రంగులో ఉంటాయంట. 

ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని మరకతంతో రూపొందించారు.

ఈ అమ్మవారి విగ్రహానికి కూడా ఓ విశేషమైన కథ ఉంది.