మెరిట్ స్టూడెంట్స్ ని ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాయి.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి.

ఇంటర్ చదివే విద్యార్థినులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఫస్ట్ క్లాస్ లో పాసయ్యే ఇంటర్ అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించనుంది.

ముఖ్యమంత్రి బాలిక స్కూటీ యోజన పథకం కింద ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్నారు.

ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా మెరిట్ స్టూడెంట్స్ ని ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది.

ఇంటర్ చదివే విద్యార్థినులు, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు ఎవరైనా సరే అత్యధిక మార్కులు సాధిస్తే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను పొందవచ్చు.

ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న 5 వేల పాఠశాలలు ప్రయోజనం పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

2023-2024 ఏడాది బడ్జెట్ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఆడపిల్లలను చదువు విషయంలో ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.