ఇటీవల కాలంలో నిత్యవసర సరకుల ధరలు బాగా పెరిగిపోయాయి.
అలానే వంట గ్యాస్ ధర బాగా పెరిగి.. సామాన్యుడికి గ్యాస్ బండ బరువెక్కింది.
కొన్నేళ్లుగా గ్యాస్ ధరలను పెంచని కంపెనీలు ఒక్కసారిగా 50 రూపాయలు పెంచేశాయి.
ఇలాంటి సమయంలో గ్యాస్ ను పొదుపుగా వాడుకోవడం ఎంతో అవసరం.
కొన్ని చిట్కాలు పాటిస్తే.. గ్యాస్ ను చాలా వరకు ఆదా చేసుకోవచ్చు.
గ్యాస్ స్టవ్ కి ఉన్న వాటిలో చిన్న బర్నర్ ని ఎక్కువగా వాడండి.
చిన్నబర్నర్ వల్ల.. గ్యాస్ వృథా అనేది చాలా వరకు తగ్గుతుంది.
స్టవ్ పై వీలైనంత వరకూ ప్రెషర్ కుక్కర్ లో వండండి.
కుక్కర్ లేకపోతే వండేటప్పుడు వంటపాత్రపై మూత పెట్టి వండండి.
స్టవ్ పై మంటకూ, పాత్రకు మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోండి.
స్టవ్ మంటకు పాత్రకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే గ్యాస్ వృథా అవుతుంది
చాలామంది సామాన్లు కడిగి నేరుగా గ్యాస్ స్టవ్ మీద పెట్టి వంట చేస్తుంటారు.
అప్పటికే తడిగా ఉన్న పాత్ర ఆరడానికి మంట ఎక్కువ అవసరం అవుతుంది.
అలాంటి తడి పాత్రలకు బదులుగా ఆరిన పాత్రనే పొయ్యిపై పెడితే గ్యాస్ సేవ్ అవుతుంది.
వండే కూరగాయలు కూలింగ్ లేకుండా చూసుకొండి.
చల్లని పదార్థలు స్టవ్ పై వండితే గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతోంది
ఇలా మరికొన్ని చిట్కాలు వాడటం వల్లన గ్యాస్ వృథాను అరికట్ట వచ్చు.