ఒకప్పుడు కట్టల పొయ్యి మీద వంటే చేసేవారు. గంటల గంటల సమయం పట్టేది. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్ వచ్చింది.
ఆ సమస్యల నుండి బయటపడేసేందుకు గ్యాస్ సిలిండర్ వచ్చింది. అయితే వచ్చిన కొత్తలో దీనిని బుక్ చేసుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా పెద్ద తలనొప్పిగా ఉండేది. ఆ తర్వాత కాల్స్ ద్వారా బుక్ చేసుకునేవారు.
ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. దేనైనా చిటికెలో తెచ్చుకోగలుగుతున్నాం.
అలానే గ్యాస్ సిలిండర్‌ను కూడా బుక్ చేసుకునే అవకాశం వచ్చింది. అదీ కూడా వాట్సప్ ద్వారానే..
హెచ్‌పీ, ఇండియన్, భారత్ గ్యాస్ వంటి కంపెనీలకు సంబంధించిన సిలిండర్ అయినా పర్వాలేదు.
వాట్సాప్‌లో సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..
హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ అయితే.. మీ ఫోన్‌లో 9222201122 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
వాట్సాప్ ఓపెన్ చేసి పైన తెలిపిన నెంబర్‌కు ‘బుక్’ లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి.
అనంతరం వచ్చే ఆప్షన్స్‌కు అనుగుణంగా సిలిండర్‌ను బుక్ చేసుకోవాలి. చివరగా మీ సిలిండర్ బుక్ అయినట్లు కన్ఫర్మేషన్ వస్తుంది.
భారత్ గ్యాస్ సిలిండర్ కోసమైతే.. ముందుగా ఫోన్‌లో 1800224344 నెంబర్‌ను ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
అనంతరం ఈ నెంబర్ చాట్ బాక్స్‌ను ఓపెన్ చేసి ‘బుక్’ లేదా ‘1’ అని టైప్ చేసి సెండ్ చేయాలి.
అనంతరం ఆప్షన్స్ ఆధారంగా మీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇక ఇండియన్ గ్యాస్ వినియోగదారులైతే.. ముందుగా 7588888824 నెంబర్‌ను నమోదు చేసుకోవాలి.
వాట్సాప్ చాట్ బాక్స్ ఓపెన్ చేసి బుక్ లేదా రిఫిల్ అని మెసేజ్ పంపించాలి.
వెంటనే సిలిండర్ బుక్ అయినట్లు రిప్లే వస్తుంది. ఇందులో సిలిండర్ డెలివరీ డేట్ కూడా ఉంటుంది.
సిలిండర్ స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే.. స్టేటస్ అని సెండ్ చేస్తే వివరాలు వస్తాయి.