మనిషి జీవితంపై సెల్‌ ఫోన్‌ ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సెల్‌ ఫోన్‌ నేటి ప్రజల బ్రెయిన్‌లా మారిపోయింది. అందులో ఎవరి వారి వ్యక్తిగత రహస్యాలు నిక్షిప్తమై ఉంటున్నాయి.

ఈ స్టోరీ లైన్‌పైనే లవ్‌టుడే సినిమా తెరకెక్కింది. ఇద్దరు ప్రేమికులు ఒకరి ఫోన్‌ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్నదే కథ.

నిజ జీవితంలోనూ లవ్‌టుడే సీన్‌ రిపీటైంది. పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట తమ ఫోన్లు మార్చుకుంది. దీంతో యువకుడు జైలు పాలయ్యాడు.

 తమిళనాడులోని బేలూరుకు చెందిన అరవింద్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది.

ఈ నేపథ్యంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి అరవింద్‌, ఆ యువతి ఫోన్లు మార్చుకున్నారు.

అతడి ఫోన్‌లో బాలికకు చెందిన ఓ నగ్న వీడియో కనిపించింది.

దీంతో యువతి కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది.

బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో యువకుడు జైలు పాలయ్యాడు.