చేదుగా ఉంటుందని కాకరకాయను చాలామంది తినరు. కానీ కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.

దీనిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మిగతా వాటిలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం దీనిలో ఉంటుంది.

100 గ్రాముల కాకరకాయలో 34 కేలరీలతో పాటుగా 13 మిల్లీ గ్రాముల సోడియం, 602 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

దీనిలో విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్ జింక్, భాస్వరం, డైటరీ ఫైబర్స్ కూడా ఉంటాయి.

కాకరకాయ రసంలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

కాకరకాయ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ చర్మంపై మచ్చలు, మొటిమలు, సోరియాసిస్ కూడా తగ్గిపోతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహం(షుగర్)తో బాధపడుతున్నారు.

కాకరకాయలో పాలిపెప్టైడ్-పి, పి-ఇన్సులిన్ అని పిలువబడే ఇన్సులిన్ సమ్మేళనం ఉంటుంది. ఇద డయాబెటీస్ ను నియంత్రిస్తుందని పరిశోధనలు నిరూపించాయి.

 2,000 మిల్లీగ్రాముల కాకరకాయని రోజూ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలావరకు తగ్గితాయని పరిశోధకులు కనుగొన్నారు.

కాకరకాయలు విటమిన్ సి భాండాగారం. దీనిలో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాకరకాయ రసంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.

కాకరకాయను రోజూ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

కాకరకాయలో పొటాషియం రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. శరీరంలోని అదనపు సోడియాన్ని గ్రహిస్తుంది. దీనిలోని ఐరన్, ఫోలిక్ యాసిడ్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కాకరకాయ.. అలర్జీలు, అజీర్ణాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

ఒక అధ్యయనంలో కాకరకాయలో యాంటీ కార్సినోజెన్, యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇది ప్రోస్టేట్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గిస్తుంది.

నోట్: పై చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్ సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.