ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ‘శ్రీకృష్ణాష్టమి’.

‘శ్రీకృష్ణాష్టమి’ అంటే శ్రీ కృష్ణుడి పుట్టిన రోజు. 

శ్రీ కృష్ణుడు ద్వాపరయుగంలో శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు జన్మించాడు. 

చాలా ఏళ్లుగా శ్రీకృష్ణుడు మనిషా? లేక దేవుడా? ఇంతకీ ఆయన ఎవరు? అన్న దానిపై చర్చ జరుగుతోంది. 

ఈ ప్రశ్నకు కార్తికేయ 2 సినిమా రూపంలో ఓ జవాబు దొరికినట్లయింది. 

శ్రీకృష్ణుడు గీతతో కోట్లమందికి దారి చూపించిన గొప్ప గురువు.

రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన గొప్ప ఆర్కిటెక్ట్‌.

చూపుతోనే మనసులోని మాట చెప్పిన గొప్ప సైకాలజిస్టు.

వేణు గానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసిన గొప్ప మెజీషియన్‌.

నిత్యం ఆరోగ్యంతోనే ఉండే సూచనలు చెప్పిన గొప్ప డాక్టర్‌.

ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన గొప్ప వీరుడు. 

కరువు కష్టం తెలియకుండా తన ప్రజలను చూసుకున్న గొప్ప రాజు.

కరువు కష్టం తెలియకుండా తన ప్రజలను చూసుకున్న గొప్ప రాజు.

అన్‌ కంట్రోలబుల్‌ ఆర్పియంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్‌ చేసిన గొప్ప కైనటిక్‌ ఇంజనీర్‌.

శ్రీ కృష్ణుడు ఈ మట్టిపై మనిషిగా పుట్టి.. ఉత్తమ కార్యాలతో దైవంగా మారాడు.