పరమశివుడు, పార్వతీదేవిల ప్రియసుతుడైన విఘ్నేశ్వరుడిని ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు

అయితే.. ఆ మహాగణపతి రూపం వెనుక ఎంతో తాత్వికత దాగుందని ఎంతమందికి తెలుసు

గణేశుడి దేహం పూర్ణకుంభాన్ని తలపిస్తుంది.. అది పరిపూర్ణమైన జగత్తుకి చిహ్నం

లంబోదరుడి బొజ్జ.. జీవితంలో మంచి చెడులను స్వీకరించాలని చెబుతుంది

గజముఖుడిగా పిలుచుకునే ఆయన తల మేధస్సుకు చిహ్నం

గణేశుడి సన్నని కనులు.. జీవితంలో నిశితమైన పరిశీలన కలిగి ఉండాలని సూచిస్తాయి

గణపతి వక్రతుండం(తొండం) ఓంకార ప్రణవనాదానికి ప్రతీక

గణేశుని మహాకాయాన్ని(భారీ దేహాన్ని) మోసే మూషికము(ఎలుక) ఆశలెప్పుడు చిన్నగా ఉండాలని గుర్తుచేస్తుంది

జీవితంలో పట్టుదల ఉంటే ఎంతటి భారాన్ని అయినా సాధించవచ్చని ఎలుక సూచిస్తుంది

విఘ్నేశ్వరుడి బొజ్జ చుట్టూ ఉండే సర్పము(పాము) శక్తికి చిహ్నం

వినాయకుడి నాలుగు చేతులు.. సామర్థ్యాలు, తత్వాలకు గుర్తులు

విఘ్నేషుడి చేతిలో ఉండే పాశం, అంకుశం సన్మార్గంలో నడవాలని చాటిచెప్పే ప్రతీకలు

గణపయ్య చెవులు.. అనవసర విషయాలను వదిలేసి మంచి విషయాలను గ్రహించాలని సూచిస్తాయి

లంబోదరుడి చిన్న నోరు.. అతిగా మాట్లాడి ఇబ్బందుల్లో పడకుండా, ఎక్కువగా విని మితంగా మాట్లాడాలని చెబుతాయి

గణేశుడు చేతబట్టిన గొడ్డలి.. బంధాలేవీ శాశ్వతం కాదని, చెడు సావాసాలను తెంచుకోవడానికి గుర్తు

బొజ్జగణపయ్య చేతిలో లడ్డు.. ఆశయాలను సాధించే దిశగా అడుగేస్తే ప్రతిఫలం తప్పక లభిస్తుందని చెప్పే సంకేతం