స‌హ‌జ సిద్దంగా తియ్యటి రుచిని క‌లిగి ఉండే వాటిల్లో ఖర్జూరాలు ఒక‌టి.

ఇవి మధుర‌మైన రుచితో పాటు ఎన్నో పోష‌కాలను కలిగి ఉంటాయి. 

వీటిని ఆహారంగా తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. 

మనం పండు క‌ర్జూరాల‌తో పాటు ఎండిన ఖర్జూరాల‌ను కూడా తింటూ ఉంటాం.

తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా ఈ ఎండు ఖర్జూరాల‌ను వాడుతూ ఉంటారు.

ఎండు ఖర్జూరం తీసుకోవ‌డం మంచి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చంట.

మరి. ఎండు ఖర్జూరం తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఖర్జూరంలో ఉండే ఖ‌నిజాలు ఎముక‌లను బ‌లంగా త‌యారు చేయ‌డంలోస‌హాయ‌ప‌డ‌తాయి.

ఖర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగు సంబంధిత వ్యాధులు న‌యం అవుతాయి.

ఖర్జూరాల‌లో ఉండే ఆమైనో ఆమ్లాలు, పీచు ప‌దార్థాలు జీర్ణక్రియ‌ను మెరుగుప‌రుస్తాయి.

ఎండు ఖర్జూరాల‌లో ఉండే ఐర‌న్ ర‌క్తహీన‌త స‌మ‌స్యను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నాన‌బెట్టిన ఖర్జూర పండ్లను తిన‌డం వ‌ల్ల మూత్రం సాఫీగా  జరిగి.. దాని సంబంధిత స‌మ‌స్యలు తొల‌గిపోతాయి.

నాన‌బెట్టిన ఖర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్యను పూర్తిగా నివారించ‌వ‌చ్చు.

ఎండు ఖర్జూరం తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ, అసిడిటి, అల్సర్ వంటి స‌మ‌స్యలు నియంత్రణ‌లో ఉంటాయి. 

గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కొలెస్ట్రాల్ ను త‌గ్గించే శ‌క్తి ఈ ఖర్జూరాల్లో మెండుగా ఉంది. 

ఖర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే ముడ‌త‌లు తొల‌గిపోయి య‌వ్వనంగా క‌న‌బ‌డ‌తారు.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, జుట్టు తెల్లబ‌డ‌డం వంటి స‌మ‌స్యలు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. 

ఈ ఆరోగ్య లాభాలు పొందాలంటే..రోజూ కొన్ని ఖర్జూరాల‌ను నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తిని ఆ నీటిని తాగాలి.

అప్పుడే ఖర్జూరాల‌ను తీసుకోవ‌డం వల్ల క‌లిగే ప్రయోజనాల‌ను మ‌నం పొంద‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహాలు తీసుకోండి.