తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తన కామెడీతో పాపులర్ అయిన కమెడియన్ వివేక్ 2021 ఏప్రిల్ 17వ తేదీన గుండెపోటుతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో మరణించాడు.
‘వీడొక్కడే’ ‘రంగం’ ‘బ్రదర్స్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించిన దర్శకుడు కె.వి.ఆనంద్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో గుండెపోటుతో మరణించాడు.
ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు అయిన టి.ఎన్.ఆర్ ఈ ఏడాది మేలో కరోనాతో మరణించారు.
ప్రముఖ జర్నలిస్ట్,నిర్మాత, మహేష్ బాబు పి.ఆర్.ఓ అయిన బి.ఏ.రాజు కూడా ఈ ఏడాది గుండెపోటుతో మరణించారు.
తెలుగుతో పాటు కన్నడలో కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నటి జయంతి కూడా ఈ ఏడాది జూలైలో మరణించారు.
‘వేదం’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన నాగయ్య ఈ ఏడాది మార్చిలో ఈయన మరణించడం జరిగింది.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈ ఏడాది ‘యువరత్న’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ఇతను కూడా అక్టోబర్లో గుండెపోటుతో మరణించాడు.
ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్వో అయిన మహేష్ కోనేరు కూడా ఈ ఏడాది అక్టోబర్లో గుండెపోటుతో మరణించారు.
ప్రముఖ జర్నలిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు అయిన మహేష్ కత్తి ఈ ఏడాది జూలైలో మరణించాడు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత అయిన శివ శంకర్ మాస్టర్ ఈ ఏడాది నవంబర్ లో కరోనాతో మరణించారు.
టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఈ ఏడాది నవంబర్ లో మరణించిన సంగతి తెలిసిందే.