ప్రస్తుతం స్మార్ట్ ఫోన్..అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏ పనీ ముందుకు సాగట్లేదు.
అంతేకాదు.. వీటితో కాలక్షేపం కూడా అవుతుండడంతో జనాలు ఎగబడి మరీ కొంటున్నారు.
రాను రాను స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నా.. వీటి అమ్మకాల్లో మాత్రం జోరు తగ్గట్లేదు.
కంపెనీలు కూడా.. బడ్జెట్ ఫోన్‌లు, ప్రీమియం ఫోన్లు అంటూ రోజుకో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి.
ఇప్పుడు ఆగష్టు నెల వచ్చేసింది. ఈనెలలోనూ భారత్‌లో కొత్త మొబైళ్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ప్రీమియమ్ రేంజ్‌లో ఆసక్తికరమైన ఫోన్లు రానున్నాయి.
శాంసంగ్, ఐకూ, వన్‌ప్లస్, రియల్‌మీ,తో పాటు మరిన్ని కంపెనీల నుంచి పోన్లు విడుదల కానున్నాయి.
స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మొబైళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ వివరాలు మీకోసం..
వన్‌ప్లస్ 10టీ ఆగస్ట్ 3న భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనంది. వన్‌ప్లస్ ఫోన్లలో తొలిసారిగా వన్‌ప్లస్ 10టీ 16జీబీ ర్యాంతో రానుంది.
6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+జెన్ 1 ప్రాససర్, 150వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్, సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్‌తో పాటు, 369 డిగ్రీ యాంటెన్నా సిస్టమ్.. వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ప్రారంభ ధర రూ 49,999 గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఐకూ 9టీ మనదేశంలో ఆగష్టు 2న లాంచ్ కానుంది. క్వాల్‌కామ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1తో ఈ మొబైల్ వస్తోంది. ఇందులో 6.78 అంగుళాల ఈఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
రెండు వేరియంట్లలో ఐకూ 9టీ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మోటో రేజర్ ఆగష్టు 2న లాంచ్ కానుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రానుంది.
ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఒక ఫోల్డబుల్ డివైజ్ రావడం ఇదే తొలిసారి. మోటో రేజర్ 2022లో కొత్త myui 4.0 ఓఎస్ తో రావొచ్చని వార్తలు వస్తున్నాయి. మోటో రేజర్ ధర సుమారు రూ. 94,000 వరకు ఉండొచ్చని అంచనా.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4
శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ఆగష్టు10న జరగనుంది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 అను రెండు ఫోల్డబుల్ మొబైళ్లను లాంచ్ కానున్నాయి.
ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్స్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. మిగిలిన విభాగాల్లోనూ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ల ధరలు దాదాపుగా రూ. 1.60 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 (ఫీచర్స్)
ఇవేకాకుండా.. వివో వి25 సిరీస్, రియల్‌మీ జీటీ నియో 3టీ, షావోమీ 12 లైట్, పోకో ఎం5 వంటి మొబైల్స్ లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.