తను నేను, పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి విభిన్న కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ నటించిన సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్.

సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటించిన  ఈ మూవీ ఇవాళ (నవంబర్ 4న) రిలీజ్ అయ్యింది. 

కథ: విప్లవ్ (సంతోష్ శోభన్) ట్రావెల్ వ్లాగర్ గా రకరకాల ప్రాంతాలు తిరుగుతూ.. వాటిని వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. ఫేమస్ ట్రావెల్ వ్లాగర్ గా గుర్తింపు పొందాలను కలలు కంటూ ఉంటాడు.

మరో ట్రావెల్ వ్లాగర్ వసుధ (ఫరియా అబ్దుల్లా) ఫేమస్ యూట్యూబర్. ఈ ఇద్దరూ అరకు అడవుల్లో కలుసుకుంటారు. అనుకోకుండా నక్సలైట్ దళానికి చిక్కుతారు. వారి నుంచి ఎలా బయటపడ్డారు? నక్సలైట్ దళానికి, వీరికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ. 

నక్సల్ ఉద్యమం అనే సీరియస్ బ్యాక్ డ్రాప్ ని, ట్రావెల్ వ్లాగర్స్ చేసే వినోదంతో ముడిపెట్టి దర్శకుడు కథ రాసుకున్నాడు.

ఒక సీరియస్ నేపథ్యం ఉన్న కథని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 

ఫేమస్ యూట్యూబర్ అయ్యేందుకు విప్లవ్ పడే పాట్లు, వసుధ ప్రేమ కోసం వేసే వేషాలు వంటివి రొటీన్ గా అనిపిస్తాయి. 

విరామానికి ముందు వసుధ తండ్రి డీజీపీపై నక్సల్స్ కాల్పులు జరపడం.. ఆ వెంటనే అరకులో విప్లవ్, వసుధ నక్సల్ గ్యాంగ్ కి పట్టుబడడం వంటివి ఆసక్తికరంగా అనిపిస్తాయి.

ఈ నక్సల్స్ కి, పోలీసులకు మధ్య జరిగే పోరాటంలో ఎవరి పై చేయి సాధిస్తారు? ఈ పోరాటంలో విప్లవ్, వసుధ తమ ప్రేమని ఎలా కాపాడుకుంటారు? అనే ఎలిమెంట్స్ తో సెకండాఫ్ సాగుతుంది.

సంతోష్ శోభన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగుంటాయి. వసుధ పాత్రలో ఫరియా అబ్దుల్లా కూడా మెప్పించింది. బ్రహ్మాజీ, సుదర్శన్ కామెడీతో నవ్వులు పూయిస్తారు. 

ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వసంత్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ప్లస్ లు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా నటన బ్రహ్మాజీ, సుదర్శన్ ల కామెడీ

మైనస్ లు: కథ రొటీన్ సన్నివేశాలు

చివరి మాట: ఒకసారి ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ చే(చూ)సుకోవచ్చు

రేటింగ్: 2.5/5