అతిగా పెరుగుతున్న చమురు ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితులతో అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలు దారి పడుతున్నారు.
కేంద్రం, రాష్ట్రాలు కూడా ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పలు నజరానాలను ప్రకటిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఈవీ బైక్ లు, కార్ల వినియోగం, కొనుగోళ్లు గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగాయి.
కానీ, ఎలక్ట్రికల్ కార్లు, బైక్ ల వినియోగదారులకు ఎదురయ్యే పెద్ద సమస్య ఛార్జింగ్.
పలు మెట్రోపాలిటన్ సిటీల్లోనూ ఇంకా పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పాయింట్లు రాలేదు. వచ్చినా కనీసం హాఫ్ బ్యాటరీ ఫుల్ అవ్వాలి అంటే గంట అన్నా వెయిట్ చేయాలి.
ఆ సమస్యకు చెక్ పెడుతూ నెదర్లాండ్స్ కు చెందిన ‘లైట్ ఇయర్’ కంపెనీ సౌరశక్తితో నడిచే కారును కనిపెట్టింది.
ఈ ‘లైట్ ఇయర్ వన్’ కారును ఏడాదికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు.
అంతేకాకుండా అన్ని ఎలక్ట్రానిక్ కార్లతో పోలిస్తే లైట్ ఇయర్ వన్ కారు చాలా తక్కువ ఎనర్జీని ఉపయోగిస్తుందని తెలిపారు.
దాదాపు 80 కిలోమీటర్లకు ఒక వాట్ మాత్రమే వినియోగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
అంటే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు వినియోగించే ఎనర్జీ కంటే దాదాపు మూడు రెట్లు తక్కువ అనమాట.
లైట్ ఇయర్ కారులో మరో విశేషం ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ తో దాదాపు 709 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లు తెలిపారు.
అతి త్వరలో ఈ లైట్ ఇయర్ వన్ కారును మార్కెట్ లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు.
ఈ కారు అంత చీప్ గా ఏమీ వచ్చేలా లేదు.
దీని అంచనా ధర రూ.కోటీ 30 లక్షలకు(1,75,000 డాలర్లు) పైగానే ఉండచ్చని అంటున్నారు.