పురాతన కాలంనుంచి భారతీయులు నిమ్మగడ్డిని వాడుతూ వస్తున్నారు.

నిమ్మగడ్డిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.

నిమ్మగడ్డిలో నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగించే పదార్థాలు మెండుగా ఉంటాయి.

అది జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

గర్భాశయం, రుతు ప్రవాహానికి ఎంతో మేలు చేస్తుంది.

నిమ్మగడ్డిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

నిమ్మగడ్డి మన శరీరం నుంచి హానికరమైన విష వ్యర్థాలు మూత్రం గుండా బయటకు పంపుతుంది.

మూత్రపిండాలు, కాలేయంతో పాటుగా ఇతర అవయవాల పనితీరును మెరుగుపర్చడంలో నిమ్మగడ్డి దోహద పడుతుంది.

అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

నిమ్మ గడ్డి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

నిమ్మ గడ్డి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మంపై రంధ్రాలను తగ్గింగి, చర్మాన్ని టోన్ చేస్తుంది. 

నిమ్మగడ్డితో మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది.

నిమ్మగడ్డి టీలో హిప్నోటిక్, మత్తుమందు లక్షణాలు నిద్రలేమిని దూరం చేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

నోట్: మేం చెప్పిన టిప్స్ పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి