భారతదేశంలో ఎన్నో సనాతన సాంప్రదాయాలు ఉన్నాయి. 

సాంప్రదాయాలతో పాటే ముఢనమ్మకాలు సైతం ఉన్నాయి.

ఇక భారతీయ చరిత్రలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ఉన్నట్లే శకున శాస్త్రం కూడా ఉంది.

దాని ప్రకారం పిల్లి ఎదురొస్తే, కాకి తంతే చెడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు.

ఇక స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే మంచిదని, పురుషులకు కుడికన్ను అదిరితే మంచిదని మనం చాలా సార్లే విని ఉంటాం.

దీన్ని నమ్మడానికి బలమైన కారణం.. రావణుడి మీదకు యుద్ధానికి బయలుదేరినప్పుడు సీతకు, రావణాసురిడికి ఒకేసారి ఎడమ కన్ను అదిరాయట. 

అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం లోకి వచ్చింది.

అయితే శరీర భాగాలు తరచుగా అదరడానికి అనేక కారణలు ఉంటాయంటున్నారు వైద్యులు.

అది నరాల బలహీనతకు సూచన గా వైద్యులు సూచిస్తున్నారు.

ఆయుర్వేదం ప్రకారం వాత, పిత గుణాలు ప్రకోచించినప్పుడు శరీర భాగాలు అదురుతుంటాయంట.

అదీ కాక కంటి సంబంధించిన సమస్యలు ఉన్నా.. కన్ను అదురుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

అలాంటప్పుడు వైద్యులను సంప్రదించాలి కానీ ముఢనమ్మకాలతో మంచి, చెడులు జరుగుతాయని ఉండకుండా.. 

వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు