గాన కోకిల, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన  లతా మంగేష్కర్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.ఫిబ్రవరి 6న మృతి చెందారు.

ఆమె జీవితాన్ని కుటుంబానికి, పాటకే అంకితం చేశారు. తండ్రి మరణంతో.. తోబుట్టువుల బాధ్యతలను తన మీద వేసుకున్నారు. 

వారిని జీవితంలో మంచి స్థాయిలో నిలిపేందుకు.. తన జీవితాన్ని త్యాగం చేశారు. 

వారి జీవితాల్ని నిలబెట్టే క్రమంలో లత తన గురించి ఆలోచించడం మానేశారు. 

పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబం కోసం త్యాగం చేశారు. 

జీవితాంతం అవివాహితగానే ఉన్నారు.  

వృత్తిపరమైన జీవితం గురించి ఎంతో ఒపెన్‌ గా ఉండే లతా మంగేష్కర్‌ తన వ్యక్తిగత జీవిత

విషయాలకు వచ్చే సరికే చాలా గోప్యంగా ఉండేవారు. 

అయితే కొన్ని ఇంగ్లీష్‌ మీడియా కథనాల ప్రకారం లతా మంగేష్కర్‌ తన జీవితంలో ఓ వ్యక్తిని అమితంగా ప్రేమించారు. 

కానీ అతడు రాజకుటుంబానికి చెందిన వాడు కావడంతో.. వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు. 

ఆ బాధతో ఆమె జీవితాంతం ఒంటరిగా ఉండిపోయారట. ఏషియానెట్‌ ప్రచురించిన కథనం ప్రకారం.. 

మాజీ క్రికెటర్‌, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్‌ రాజ్‌ సింగ్‌ దుంగార్పర్‌ ని లతా మంగేష్కర్‌ ప్రేమించారట. వారి ప్రేమ కథ వివరాలు.. 

దుంగార్పర్‌ లా చదవడానికి ముంబై వచ్చినప్పుడు.. లతా మంగేష్కర్‌ సోదరుడి ద్వారా ఆయనకు ఆమెతో పరిచయం ఏర్పడింది. 

అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం గురించి దుంగార్పర్‌ తన తల్లిదండ్రులకు తెలియజేశాడు.  

అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం గురించి దుంగార్పర్‌ తన తల్లిదండ్రులకు తెలియజేశాడు.  

అయితే దుంగర్పార్‌ రాజస్తాన్‌ కు చెందిన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రాజవంశానికి చెందిన వ్యక్తి.. 

సామాన్య కుటుంబానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడానికి  రాజ్‌ సింగ్‌ దుంగర్పార్‌ తండ్రి, 

దుంగర్పూర్ పాలకుడు దివంగత మహారావల్ లక్ష్మణ్ సింగ్జీ అంగీకరించలేదు. 

తండ్రి మాట మీద గౌరవంతో దుంగర్పార్‌ తమ ప్రేమకు ముగింపు పలికారు. కానీ జీవితాంతం పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. 

లత కూడా అలానే భావించింది. ఇద్దరు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే గడిపారు.  

అయితే ఇద్దరి మధ్య మంచి స్నేహం బంధం కొనసాగింది. దుంగర్పార్‌ అల్జీమర్స్‌ తో బాధపడుతూ 2009లో మరణించారు.