ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి మరో కొత్త వేరింయట్‌ ను పరిచయం చేస్తున్నారు. 

డిఫెండర్ లో ఉన్న 90, 110న తర్వాత ఇప్పుడు కొత్తగా 8 సీట్స్‌ కెపాసిటీతో 130 వేరియంట్‌ ను తీసుకొస్తున్నారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130కి సంబంధించిన పూర్తి వివరాలు, సామర్థ్యం తెలిసేలా రూపొందించిన వీడియో విడుదల చేశారు.

ఈసారి కారులో వినియోగదారులకు నచ్చే విధంగా ఎన్నో మార్పులు, చేర్పులు కూడా చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆ వీడియో చూసిన తర్వాత ఆఫ్‌ రోడ్‌ వెహికిల్స్‌ లో ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కు ఉన్న నంబర్ వన్‌ స్థానాన్ని మరింత సుస్థిర పరిచేలా ఉన్న డిఫెండర్‌ 130 ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్స్‌, ఫిచర్స్‌ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం.

ల్యాండ్‌ రోవర్‌ నుంచి వచ్చిన ఈ డిఫెండర్‌ 130ని ఎక్కడా రాజీ పడకుండా.. తాము రూపొందించిన అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత ధృడమైనదిగా తయారు చేసినట్లు చెబుతున్నారు. 

ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి ప్రాంతంలోనైనా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా డిఫెండర్‌ ప్రాయాణంచేయగలదని చెబుతున్నారు.  

కేవలం 110 నుంచి 130కి పొడవును పెంచడం మాత్రమే కాకుండా.. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లు, ఆప్షన్స్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. 

స్పెసిఫికేషన్స్ 

2+3+3గా ఈ ల్యాండ్ రోవర్ డిఫండర్‌ 130ని రూపొందించారు. మూడు వరసల్లోనూ ఎక్కువ బూట్‌ స్పేస్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఆఖరి వరుసలో సైతం ఎంతో సౌకర్యంగా కూర్చునే వీలు కల్పించారు. మొదటి రెండు వరుసలకు పానరోమిక్‌ రూఫ్‌ ఓపెనింగ్‌ ఇవ్వడంతో పాటు మూడో వరుస కోసం ఫిక్స్ డ్ గ్లాస్‌ రూఫ్‌ ను అమర్చారు.  

కారుకు సంబంధించిన అన్ని కంట్రోల్స్ ను హ్యాండిల్‌ చేసేందుకు డిఫెండర్‌ 130లో పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ తో పాటు.. 11.4 ఇంచ్‌ టచ్‌ డిస్‌ ప్లేని అమర్చారు. 

అంతేకాకుండా డిఫెండర్‌ 130లో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌ సదుపాయం కూడా ఉంది. అడాప్టివ్ డైనమిక్స్, ఎయిర్ సస్పెన్షన్‌ డిఫెండర్‌ 130లో హైలెట్ అనే చెప్పాలి. 

ఎలాంటి సర్ఫేస్‌ లోనైనా సేఫ్‌ గా డ్రైవ్‌ చేసేందుకు.. ఆప్షనల్ కన్ఫిగరబుల్ టెరైన్ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  

ఇంజిన్ విషయానికి వస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ తో వేరియంట్లలో 6 రకాల ఇంజిన్‌ ఆప్షన్స్‌ ఇచ్చారు. 

అంతేకాకుండా కలర్‌ వేరియంట్‌ విషయంలోనూ ఈసారి మరిన్ని ఆప్షన్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

ఈ ల్యాండ్‌ రోవర్‌ డిఫండర్‌ 130 దాదాపు 2022 సంవత్సరం చివరికి అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కారు ప్రారంభ ధర దాదాపు రూ.కోటికి పైనే ఉండచ్చంటున్నారు. 

గరిష్టంగా రూ.2.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 130 స్పెసిఫికేషన్స్‌, మోడల్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.