మనం రోజూ ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బెండకాయ ఒకటి.

బెండకాయ జిగురుగా ఉంటుందన్న కారణంగా చాలా మంది  తినడానికి ఇష్టపడరు. 

కానీ బెండకాయ వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

బెండకాయల్లో విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

బెండకాయను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే నీటిని ఇస్తుంది.

బరువు తగ్గడానికి కూడా  బెండకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.

బెండకాయ లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టకుండా ఉంచుతుంది.

 ఎముకలు గట్టిగా ఉండటానికి బెండ కాయ బాగా పనికొస్తుంది. 

గర్భిణీలకు  బెండ కాయ చాలా మంచిది. పుట్టే పిల్లలు ఎముకలను  గట్టిగా  ఉండడానికి ఉపయోగపడతాయి

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా కంట్రోల్ చేయడంలో బెండకాయ సహాయపడుతుంది.

బెండకాయ గుండె సంబంధిత వ్యాధులను దరి చేరనివ్వకుండా తోడ్పడుతుంది.

బెండకాయ వలన రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి రక్త సరఫరా సాఫీగా సాగుతుంది.

గొంతువాపు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు బెండకాయ నీటిని   తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

చర్మం కాంతివంతంగా మారేందుకు బెండకాయలను ఉపయోగపడతాయి.

కాబట్టి ప్రతిరోజూ మీరు మీ డైట్ లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండండి.