గతంలో ఏమో కానీ ఈ మధ్య సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కాస్త ఓపెన్ అవుతున్నారు. చేదు నిజాల్ని బయటపెడుతున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్స్, హీరోయిన్స్ విషయంలో ఎలాంటి వేధింపులు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇది అందరి విషయంలోనూ జరగకపోవచ్చు కానీ కొన్నిసార్లు మాత్రం సదరు భామలు.. తమకు జరిగిన చేదు అనుభవాల్ని రివీల్ చేస్తుంటారు.
అయితే నటి ఖుష్బూ విషయంలో మాత్రం అలా ఏం జరగలేదు. సొంత ఇంట్లోనే ఆ తరహా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. తను 8 ఏళ్ల వయసులోనే తన తండ్రి వల్ల బయటకు చెప్పుకోలేని చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొంది.
ముంబయిలో ఓ ముస్లిం ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఖుష్బూ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. వెంకటేష్ 'కలియుగ పాండవులు'తో హీరోయిన్ గా మారిపోయింది.
ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా చేసి తన వంతు గుర్తింపు తెచ్చుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు చాలానే చేసింది.
ప్రస్తుతం 'జబర్దస్త్'లో జడ్జిగా చేస్తున్న ఖుష్బూ.. ఇద్దరు కూతుళ్లు, భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా ఆమె చెప్పిన ఓ విషయం వైరల్ అయింది.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని తాజాగా నియమించారు. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ తనపై చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల విషయాన్ని ఈమె బయటపెట్టింది.
తన భార్యపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, ఏకంగా కన్న కుమార్తెపైనే లైంగిక వేధింపులకు పాల్పడటం జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి, తన వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడింది.
8 ఏళ్ల వయసులో నేను లైంగిక వేధింపులని ఎదుర్కొన్నాను. దీని గురించి అమ్మ చెబితే అమ్మ నమ్ముతుందో లేదో అని భయపడి అప్పుడు చెప్పలేకపోయాను.
కానీ 15 ఏళ్ల వయసులో ఆయనకు (తండ్రికి) ఎదురుతిరగడం స్టార్ట్ చేశాను. నాకు 16 ఏళ్ల రాకముందే ఆయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామని నటి ఖుష్బూ అప్పట్లో తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల్ని బయటపెట్టింది. చాలామంది షాకయ్యేలా చేసింది.
మరి నటి ఖుష్బూ చెప్పిన విషయమై మీరేం అనుకుంటున్నారు. ఇలాంటి కీచక తండ్రిని ఏం చేయాలంటారు. కింద కామెంట్ చేయండి.