కానీ ఒక్కోసారి మాత్రం టమాట ధర ఆకాశాన్నంటుతుంది. ఇదిగో ఇప్పుడు టమాట ధర అమాంతం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో మొన్న కురిసిన భారీ వర్షాలు, వరదలకు చాలా ప్రాంతాల్లో పంట నాశనం అయ్యింది. దీంతో టమాట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.
పొలంలో పంట ఉన్నా కోయలేని పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీటితో ఇబ్బందులు రావడంతో మార్కెట్ లోకి పంట రావడం ఆగోపోయింది.
వర్షాలు, వరదల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకపోవడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ, సైబా, ఉషాలాం లది ఉమ్మడి కుటుంబం.