ఇప్పుడు ఐపీఎల్‌ 2021లో రెండు పేర్లు 

బాగా వినిపిస్తున్నాయి.ఒకటి ఆర్సీబీ, 

రెండు కేఎస్‌ భరత్‌ ఈ సాలా కప్‌ నమ్దే

అన్న రేంజ్‌లోనే ఆర్సీబీ ఆడుతోంది.

  అందులో ముఖ్యంగా ఈ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆర్సీబీ వికెట్‌ కీపర్‌

కోన శ్రీకర్‌ భరత్‌ తన ప్రదర్శనతో 

అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.

ఓ వైపు కీపింగ్‌, మరోవైపు బ్యాటింగ్‌తో

అందరినీ ఆకట్టుకుంటున్నాడు

ఐపీఎల్‌లో తెలుగోడి సత్తా చాటుతున్నాడు.

బౌలర్‌ ఎవరైనా సరే బాల్‌ను బౌండిరీకి

పంపేస్తున్నాడు. రెండో మ్యాచ్‌లోనే 

కెప్టెన్‌ కోహ్లీ మనసు గెలుచుకున్న

కేఎస్‌ భరత్‌ గురించి మరిన్ని 

విశేషాలు మీకోసం..

కేఎస్‌ భరత్‌ కెరీర్‌

కోన శ్రీకర్‌ భరత్‌ 1993 అక్టోబర్‌ 

3న విశాఖపట్నంలో జన్మించాడు.

ఆంధ్రప్రదేశ్ డొమెస్టిక్‌ క్రికెట్‌ టీమ్‌లో

కెప్టెన్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.

2004లో బాల్‌ బాయ్‌గా ఉండి జహీర్‌ 

ఖాన్‌తో ముచ్చటించిన స్థాయి నుంచి..

2015లో ఢిల్లీ ఐపీఎల్‌ టీమ్‌లో జహీర్‌

ఖాన్‌తో డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకునే

స్థాయికి ఎదిగాడు. రంజీల్లో ట్రిపుల్‌ 

ట్రిపుల్‌ సెంచరీ చేసిన కీపర్‌గా కేఎస్‌ 

భరత్‌ చరిత్ర సృష్టించాడు. 2019

బంగ్లాదేశ్‌పై రెండో టెస్టు టీమ్‌లో సాహాకు

సబ్‌స్ట్యూట్‌గా చోటు సంపాదించాడు.

రిషబ్‌ పంత్‌ స్థానంలో జనవరి 2020లో

టీమిండియా వన్డే స్క్వాడ్‌లో స్థానం

సంపాదించాడు. 2021లో ఇంగ్లాండ్‌ 

టూర్‌లో స్టాండ్‌బై ప్లేయర్‌గా సెలెక్ట్‌ 

అయ్యాడు.

2015లో రంజీ ట్రోఫీలో 54.1 సగటుతో

758 పరుగులు చేసి ఢిల్లీ తరఫున 

ఐపీఎల్‌లో స్థానం సంపాదించాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన

కేఎస్‌ భరత్‌ 37.24 సగటుతో 4,283

పరుగులు చేశాడు. 9 శతకాలు,23అర్ధ

శతకాలు ఉన్నాయి. హెఎస్ట్‌ స్కోర్‌ 308

ఐపీఎల్‌లో 3 ఇన్నింగ్స్‌లో 117.95 

మెయిన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా మారాడు.

స్ట్రైక్‌ రేట్‌తో 92 పరుగులు చేశాడు.

కోహ్లీ మనసు గెలిచిన భరత్‌

ముంబయి ఇండియన్స్‌తో దుబాయ్‌ 

వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌

24 బంతుల్లో 32 పరుగులు చేసి అందరి

దృష్టిని ఆకర్షించాడు.కెప్టెన్‌ కోహ్లీ కూడా

బ్యాటింగ్‌తో తనపై ఒత్తిడి తగ్గిందని ,

భరత్‌ను మెచ్చుకున్నాడు. కేఎస్‌ భరత్‌

మెచ్చుకున్నాడు.భరత్‌ ఎంతో అద్భుతంగా

అనుభవమున్న ఆటగాడిగా హిట్టింగ్‌ 

చేయడం బాగా నచ్చిందని కోహ్లీ 

చెప్పుకొచ్చాడు. కోహ్లీకి మంచి కీపర్‌ 

బ్యాట్స్‌మన్‌ దొరికేశాడని బెంగళూరు 

అభిమానులు సంబరపడుతున్నారు.