కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతన్నారు.. విడిపోయారు అంటూ పుకార్లు ప్రచారం అవుతున్నాయి.

ఈ వార్త విని విజయ్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. అసలు వాళ్లిద్దరూ విడిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

విజయ్‌-సంగీతల లవ్‌ స్టోరీ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే.. వారు విడిపోతున్నారంటే నమ్మరు. వారి బంధం అంత బలమైనది

ఇక వీరి లవ్‌ స్టోరీ కూడా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటికి కూడా విజయ్‌కి విపరీతమై లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

ఇక ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌.. పెళ్లి అంటే.. బడా సెలబ్రిటీ, వ్యాపారవేత్త కుమార్తె, బిగ్‌ షాట్‌ అయి ఉంటుందని భావిస్తారు.

కానీ అలాంటివారిని కాదనుకుని... తన వీరాభిమానిని విజయ్‌ ప్రేమించి వివాహం చేసు​కున్నాడు.

అవును విజయ్‌ భార్య సంగీత.. ఆయనకు వీరాభిమాని. ఆమెకు సినిమా ఇండస్ట్రీతో అసలు సంబంధమే లేదు.

లండన్‌లో స్థిరపడిన తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి సంగీత.

మొదటి నుంచి కూడా విజయ్ అంటే సంగీతకు చాలా అభిమానం. ఆయన సినిమాలు అన్నింటికి వదలకుండా చూసేది.

ఈ క్రమంలో తన అభిమాన హీరో విజయ్‌ని చూడటం కోసం ఆమె ఏకంగా లండన్‌ నుంచి ఇండియాకు వచ్చింది.

రావడమైతే వచ్చింది కానీ విజయ్‌ను ఎలా కలవాలో తెలియలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి.. చివరకు అభిమాన హీరోని కలుసుకుంది.

సంగీత లండన్ నుంచి తన కోసం వచ్చిందని తెలుసుకున్న విజయ్ ఆశ్చరుపోయాడు. ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు.

అలా మాటల సందర్భంలోనే విజయ్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక సంగీత.. విజయ్‌ కుటుంబ సభ్యులకు బాగా నచ్చింది.

దాంతో.. ఇసారి ఇండియా వచ్చినప్పుడు సంగీత తల్లిదండ్రులను కూడా తీసుకురమ్మన్నారు.

వారి మధ్య పరిచయం, ప్రేమ మొదలైన మూడేళ్ల తర్వాత అంటే.. 1999లో సంగీత-విజయ్‌ల వివాహం జరిగింది.

వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి సంగీత మీడియాకు చాలా దూరంగానే ఉంటారు.

22 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో ఎలాంటి పొరపొచ్చలు లేవంటారు సన్నిహితులు. విడాకులు వార్తలు కూడా పుకార్లే అని స్పష్టం చేశారు.

ఇక విజయ్‌ సంక్రాంతి బరిలో వారసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.