విరాట్ కోహ్లీ.. రన్ మెషిన్ గా, రికార్డుల రారాజు గా, ఫిట్ నెస్ కా బాప్ గా, చివరిగా GOATగా క్రికెట్ చరిత్రలో ఇన్ని పేర్లు ఏ ఆటగాడికి ఉండవు అనుకుంటా.
ఇక క్రికెట్ చరిత్రలో రోజుకో రికార్డు నమోదు అవుతూ ఉంటుంది. అయితే కొన్ని రికార్డులు మాత్రం కొంతమంది కోసమే రాసిపెట్టి ఉంటాయి.
రికార్డుల రారాజుగా క్రికెట్ గాడ్ సచిన్ కొన్ని చెక్కుచెదరని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ప్రస్తుతం ఆ రికార్డులను బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.
ఇక విరాట్ సెంచరీ కొడితే.. ఏదో ఒక రికార్డు బద్దలవుతూనే ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఆసిస్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారీ శతకం నమోదు చేశాడు కోహ్లీ. ఈ క్రమంలోనే క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సృ ష్టించని రికార్డును క్రియేట్ చేశాడు.
ఇక గత కొంత కాలంగా టెస్టుల్లో విఫలం అవుతూ వస్తున్న విరాట్.. ఆసిస్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారీ శతకం సాధించి.. ఫామ్ లోకి వచ్చాడు.
ఈ మ్యాచ్ లో 364 బంతులు ఎదుర్కొన్న విరాట్ 15 ఫోర్లతో 186 పరుగులు చేసి కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు కింగ్ కోహ్లీ. క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో అంటే టెస్ట్ లు, వన్డేలు, టీ20ల్లో 10కి పైగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో అందుకున్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో కలిపి టెస్టుల్లో 10 అవార్డులు అందుకున్నాడు.
వన్డేల్లో 38 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, టీ20ల్లో 15 అవార్డులను అందుకుని మూడు ఫార్మాట్లలో 10 అవార్డులు అందుకున్న తొలి ప్లేయర్ గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు.