ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నాసరే యాక్టర్స్ మధ్య లవ్, పెళ్లి, బ్రేకప్ చాలా నార్మల్ విషయాలు!

సహ నటీనటులని ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న యాక్టర్స్ చాలామందే ఉన్నారు.

అదే టైంలో తొలుత లవ్ మ్యారేజ్ చేసుకుని, ఆ తర్వాత విడిపోయిన జంటలు కూడా చాలానే ఉన్నాయి.

ఇలా ఇండస్ట్రీలో రీసెంట్ టైంలో పలు బ్రేకప్స్ గురించి వార్తలు, గాపిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇలా టాలీవుడ్ లో అయిన, అవుతున్న బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా ఏడోసారి బ్రేకప్ చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

'ఖడ్గం'లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన కిమ్ శర్మ.. ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసినట్లు తెలుస్తోంది.

2000-2010 మధ్య తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కిమ్ శర్మ ఆ తర్వాత నటనకు టాటా చెప్పేసింది.

యాక్టర్ గా ఉన్నప్పుడు దాదాపు ఐదుమందితో రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి.

ఇక యాక్టింగ్ తోపాటు ఆ రిలేషన్ షిప్స్ కి ఎండ్ కార్డ్ వేసిన కిమ్ శర్మ.. 2010లో అలీపుంజలి అనే డాన్ ని పెళ్లి చేసుకుంది.

దాదాపు ఆరేళ్లపాటు కిమ్ శర్మ-అలీ పుంజలి జంట బాగానే ఉన్నప్పటికీ.. పలు కారణాలతో 2016లో విడిపోయారు.

ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించని కిమ్ శర్మ.. మూడేళ్ల క్రితం టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తో కనిపించింది.

వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నాడని, డేటింగ్ చేస్తున్నారని ఆ తర్వాత కాలంలో కిమ్ పోస్ట్ చేసిన ఫొటోలతో క్లారిటీ వచ్చేసింది.

అలా పేస్ తో మంచి బాండింగ్ మెంటైన్ చేసిన కిమ్.. గతేడాది మార్చి 29న డేటింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.

ఈ ఏడాది మాత్రం అలాంటిదేం లేదు. కిమ్, పేస్.. ఇద్దరూ సైలెంటైన్ గానే ఉన్నారు. తాజాగా పేస్ ఫొటోల్ని ఈ బ్యూటీ డిలీట్ చేసింది.

దీంతో వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే న్యూస్ బయటకొచ్చింది. అంతా కిమ్ శర్మ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే మొత్తంగా కలిపి చూసుకుంటే.. కిమ్ శర్మకి ఇది ఏడోసారి బ్రేకప్ అవుతుంది. ఇది తెలిసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.