చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసిపోయింది. అయినా గానీ భయపడలేదు.

చనిపోయే ముందు కూడా తన వైద్య వృత్తిని కొనసాగించాడు హర్షవర్ధన్.

ఖమ్మం యువకుడు ఆస్ట్రేలియాలో వైద్యుడిగా పని చేసేవాడు.

ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మరణించాడు.

అయితే మరణం ముంచుకొస్తున్న సమయంలో కూడా భయపడకుండా ఇంకెవరినీ భయపెట్టకుండా పరిపక్వతగా ఆలోచించాడు.

తన చావుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఆఖరి రోజుల్లో ఓల్డేజ్ హోమ్ వారితో గడపాలని అనుకున్నాడు.

వారితో కలిసి సరదాగా బయటకు వెళ్ళాడు.

ఓల్డేజ్ నర్సింగ్ హోమ్ లో వందకు పైగా వృద్ధులు ఉంటారు. వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవాడు.

అయితే వారితో వైద్యుడిగా కాకుండా స్నేహితుడిగా మెలిగాడు.

ఎంతలా అంటే హర్షవర్ధన్ ఒకరోజు రాకపోతే ఆరోజు హర్ష రాకపోతే అలిగేవారు.

హర్ష కాకుండా వేరే డాక్టర్ వెళ్తే మాకు హర్షనే కావాలి అని పట్టుబట్టేవారు. అంతలా వారి ప్రేమను పొందాడు.

చనిపోతాడని తెలిసినా కూడా వైద్య వృత్తిని వదల్లేదు.

చివరి రోజుల వరకూ ఓల్డేజ్ లో హోమ్ లో వృద్ధులకు సేవలు అందించాడు.