మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం.. కేజీఎఫ్‌ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న విడుదలైంది.

మొదటి భాగంలో ప్రశాంత్‌ నీల్‌ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ప్రేక్షకుల్లో ఒక ఉత్సుకతను రేకెత్తించి పంపేశారు.

మరి ఆ ప్రశ్నలకు ఈ ఛాప్టర్‌-2లో సమాధానాలు దొరికాయా? ఇంతటి భారీ అంచనాలను కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2 అందుకోగలిగిందా? ఇప్పుడు చూద్దాం.

నరాచీని హస్తగతం చేసుకుని రాఖీ కొత్త సుల్తాన్ గా అవతరించడంతో ఈ ఛాప్టర్-2 మొదలవుతుంది.

చనిపోయాడనుకున్న అధీరా(సంజయ్‌ దత్‌) తిరిగి రావడంతో రాఖీకి అసలు పోటీ వచ్చినట్లైంది.

అధీరా కథలోకి వచ్చిన కాసేపటికే రాఖీ ఒంట్లో బులెట్ దింపి.. ప్రాణ భిక్ష పెడతాడు. అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది.

మొత్తం సామ్రాజ్యం ప్రమాదంలో పడుతుంది, పరిస్థితులు చేదాటిపోతాయి, రాఖీ వాటిని ఎలా చక్కదిద్దాడు.. ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకున్నాడనేది స్క్రీన్ పై చూడాల్సిందే.

ఒక దేశ ప్రధాని, ఆధిపత్యం కోసం ఎదురుచూస్తున్న విలన్స్‌ రాఖీభాయ్‌ అనే రామకృష్ణప్ప బెరియాని ఓడించగలిగారా? లేదా? అనేదే కథ.

సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌ కార్డ్‌ పడే వరకు ఎక్కడా ఏ చిన్న లాజిక్‌ మిస్‌ కాకుండా ప్రశాంత్ నీల్ ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు.

హీరోకు మొదటి నుంచి ఏ స్థాయి ఎలివేషన్స్‌ ఇస్తూ వచ్చాడో అతని ప్రత్యర్థులను కూడా అలాగే చూపించుకుంటూ వచ్చాడు.

‘నేను కొట్టిన ప్రతివాడు డానే’.. అని రాఖీ చెప్పే డైలాగ్‌కు తగ్గట్లుగా అతనికి ఎదురయ్యే ప్రతి వ్యక్తిని అదే స్థాయిలో చూపించాడు.

సినిమా మొత్తం రాఖీ వన్ మ్యాన్ షో.. సంజయ్ దత్‌, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, అయ్యప్ప పి.శర్మ, ఈశ్వరీరావు ఒక్కరని కాదు అందరూ వందకు వంద శాతం న్యాయం చేశారు.

సినిమా ఎడిటింగ్‌ విషయంలో ఉజ్వల్‌ కులకర్ని ఎంతో మంచి పనితనాన్ని చూపించి మెప్పించాడు.

సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కేజీఎఫ్‌ సామ్రాజ్యాన్ని చూపించడం, యాక్షన్‌ సీక్వెన్స్‌ లో భువన్‌ గౌడ హాలీవుడ్ ను గుర్తేచేశాడు. ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాతో మంచి కథకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.