మన దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.

అలానే వివిధ  ప్రాంతాల్లో వివిధ రకాల ఆచార, సంప్రదాయాలను పాటిస్తుంటారు.

అయితే కొన్నిప్రాంతాల్లో పాటించే ఆచారాలు చాలా వింతగా ఉంటాయి.

కేరళలోని కల్లాం జిల్లాలో నవదుర్గ ఆలయంలో కూడా ఓ వింత ఆచారం ఉంది.

అమ్మాయిల వేషాధారణలో అబ్బాయిలు ఆలయంలో క్యూ కడుతుంటారు.

 ఏటా ఈ నవదుర్గ ఆలయంలో 'చమయ విళక్కు' అనే వేడుక  నిర్వహిస్తారు.

చమయ విళక్కు ఉత్సవం 19 రోజుల పాటు  ఘనంగా జరుగుతుంది.

ఇక్కడ ఉన్న  నవదుర్గం అమ్మవారికి చమయ విళక్కు అనే దీపంతో ఆరాధిస్తారు.

ఇళ్లలోని మహిళలు   తమ ఇంట్లోని మగవారిని దగ్గర ఉండి మరీ  రెడీ  చేస్తారు.

ఆలయ ప్రాంతంలో కూడా అబ్బాయిలు మేకప్  కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.

ఈ పండుగలో చివరి రెండు రోజుల్లో మాత్రమే పురుషులు స్త్రీ వేషాధారణలో వస్తుంటారు.

ప్రతి ఏటా  సకల సౌకర్యాలతోచమయ విళక్కు పండగ పెద్దగా  నిర్వహిస్తుంటారు.

 చుట్టు పక్కల జిల్లాల నుంచి  కూడా పెద్ద  ఎత్తున  భక్తులు, యువకులు వస్తుంటారు.

  యువకులే కాకుండా , హిజ్రాలు సైతం వచ్చి అమ్మవారికి  మొక్కులు తీర్చుకుంటారు.

 ఇలా చేయడం వలన మహిళలకు గౌరవం, మర్యాదలు ఇచ్చినట్లు ఉంటదని స్థానికులు అంటున్నారు.

 ఈ పండగలో ఉత్తమ  అందగాళ్లకు బహుమతులు కూడా ప్రధానం చేస్తారు.