లాటరీ అంటేనే లక్ ఉండాలి. అప్పుడే అదృష్టం వరిస్తుంది. లక్షలు, కోట్లు మన సొంతమవుతాయి.

మన దగ్గర ఈ కల్చర్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పాలి.

అలా లాటరీలో లక్షలు గెలిచేవాళ్లు కొందరైతే.. కోట్లు సొంతం చేసుకునేవాళ్లు మరికొందరు ఉంటారు.

అయితే లాటరీ టికెట్స్ కొనేవాళ్లందరూ కూడా దాదాపుగా మధ్యతరగతి ప్రజలు, వలస కూలీలే ఎక్కువగా ఉంటారు.

అసోంకు చెందిన ఆల్బర్ట్ గిట్టా కూడా పనికోసం కేరళ వలస వెళ్లాడు. నటి రజిని చాందీ దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు.

నటి రజిని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ఆల్బర్ట్ కు లాటరీ టికెట్స్ కొనే అలవాటు కూడా ఉంది.

అలా రీసెంట్ గా కేరళ సమ్మర్ బంపర్ లాటరీలో రూ.250 పెట్టి ఓ టికెట్ కొనుగోలు చేశాడు. దాని గురించి మర్చిపోయాడు.

తాజాగా కేరళ ప్రభుత్వం ఈ లాటరీకి సంబంధించిన డ్రా తీయగా.. ఆల్బర్ట్ టికెట్ SE222282 మనీ గెలుచుకుంది.

నటి ఇంట్లో పనిచేసుకుంటున్న తనకు రూ.10 కోట్ల లాటరీ తగిలేసరికి ఆల్బర్ట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

రీసెంట్ గా లాటరీ గెలుచుకున్న ప్రకటించిన అధికారులు.. ట్యాక్సులన్నీ కట్ చేసి రూ.6.5 కోట్ల చెక్ ని ఆల్బర్ట్ కు అందజేశారు.

అందుకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి వైరల్ గా మారింది. ఇందులో నవ్వులు చిందిస్తూ ఆల్బర్ట్ కనిపించాడు.

అదే టైంలో ఆల్బర్ట్ ఎవరింట్లో అయితే పనిచేస్తున్నాడో ఆ నటి కూడా లాటరీలో అతడి గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది.

ఇదే కాదు.. ఆల్బర్ట్ ఈ మొత్తం గెలుచుకోవడానికి ముందు ఎర్నాకులంలో ఇలానే వలసొచ్చిన ఓ గెస్ట్ వర్కర్ లాటరీ గెలుచుకున్నాడు.

కొన్నిరోజులు ముందు తీసిన డ్రాలో అతడు రూ.75 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఇలా వరసగా ఇద్దరు వర్కర్స్ లాటరీ గెలవడం హాట్ టాపిక్ అయింది.

మరి వలస వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. రోజుల వ్యవధిలో ఒకరేమో లక్షలు, మరొకరేమో కోట్లు గెలుచుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.