తెలుగు హీరోయిన్స్ లో కీర్తి సురేష్ చాలా అంటా చాలా స్పెషల్. దానికి చాలానే కారణాలున్నాయి.

కేరళలో పుట్టిపెరిగిన ఈ భామ.. చిన్నప్పుడే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ గా యాక్ట్ చేసింది.

పెరిగి పెద్దయిన తర్వాత 'నేను శైలజ' మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంటరైంది.

ఆ వెంటనే నాని, పవన్ కల్యాణ్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. హీరోయిన్ గా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే 2018లో వచ్చిన 'మహానటి' చిత్రం.. కీర్తి సురేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

ఎందుకంటే సావిత్రి బయోపిక్ గా తీసిన ఈ మూవీలో యాక్టింగ్ కి గానూ కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంది.

ఆ తర్వాత కీర్తి సురేష్ కి ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన మూవీ పడలేదు. దీంతో అరడజనుకి పైగా ఫ్లాప్స్ వచ్చాయి.

అలాంటి కీర్తి సురేష్ కి గతేడాది వచ్చిన సాని కాయిదమ్ (తెలుగులో 'చిన్ని') మూవీతో హిట్ దక్కింది.

కానీ ఇది ఓటీటీలో రిలీజైంది కాబట్టి పెద్దగా లెక్కలోకి రాదు. తాజాగా 'దసరా'తో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

వెన్నెల అనే క్యారెక్టర్ లో రఫ్ఫాడించేసింది. అలాంటి కీర్తి సురేష్ సడన్ గా ముఖానికి గాయాలతో కనిపించి షాకిచ్చింది.

దీంతో ఆమె ఫ్యాన్స్ తోపాటు నెటిజన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందా అని తెగ సెర్చ్ చేశారు.

అయితే రియల్ గా ఈ దెబ్బలేం తగల్లేదు. తాజాగా కీర్తి సురేష్ పోస్ట్ చేసిన వీడియోతో దీనిపై క్లారిటీ వచ్చేసింది.

'చిన్ని'లో డీ గ్లామర్ రోల్ చేసిన కీర్తి సురేష్.. ఆ మూవీలో చాలావరకు ముఖానికి గాయాల మేకప్ తో కనిపిస్తుంది.

ఇప్పుడు ఆ సినిమాకు ఏడాది పూర్తయిన సందర్భంగా షూటింగ్ పిక్స్, వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

అది చూసే చాలామంది ఫస్ట్ షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని రిలాక్స్ అయిపోయారు.

సో అదన్నమాట విషయం. మరి కీర్తి సురేష్ గాయపడిందని ఫొటోలు చూసిన వెంటనే మీకేం అనిపించింది? కామెంట్ చేయండి.