కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మహానటిలో కీర్తి సురేశ్ అద్భుతమైన ప్రతిభతో ఆ పాత్రకు ప్రాణం పోసింది.
ఈ సినిమాలో ఆమె నటనకు గాను జాతీయ అవార్డు సైతం గెలుచుకుంది. నాటి నుంచి ఇండస్ట్రీలో మహానటిగా నిలిచింది.
మహానటి సినిమాతో జాతీయ అవార్డు అయితే గెలుచుకుంది కానీ.. ఆ సినిమా సక్సెస్ ఆమెకు ప్లస్ అవ్వలేదు.
మహానటి తర్వాత.. కీర్తి నటించిన సర్కారు వారి పాట సినిమా మాత్రమే విజయం సాధించింది.
ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాలో నటించింది కీర్తి సురేశ్.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకులు ముందుకు రానుంది.
కీర్తికి ఓ గుప్ప గుణం ఉంది. తాను ఒప్పుకున్న సినిమా తన మనసుకు చేరువైతే.. చిత్రబృందానికి ప్రత్యేక బహుమతులు ఇస్తుంది.
గతంలో మహానటి సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఇలానే చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చింది.
తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకుంది కీర్తి సురేశ్.
దసరా మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత.. ఆ సినిమాకు పని చేసిన టెక్నికల్ బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది కీర్తి.
సుమారు 130 మందికి బంగారు కాయిన్స్ బహుమతిగా ఇచ్చింది.
దసరా సినిమాలో తను పోషించిన వెన్నెల పాత్ర తనకు ఎంతో నచ్చిందని.. అంతేకాక చిత్ర బృందం షూటింగ్ సమయంలో తనను ఎంతో బాగా చేసుకున్నట్లు వెల్లడించింది కీర్తి.
వారిపై తన కృతజ్ఞత చాటు కోవడం కోసం.. వారందరికి బంగారు కాయిన్స్ గిఫ్ట్‌గా అందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజనులు, అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక నాని సరసన కీర్తి నటించడం ఇది రెండో సారి. గతంలో నోను లోకల్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.
దసరా చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతడికి ఇదే తొలి చిత్రం.