హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో  మహాశివరాత్రి ఒకటి.

ఈ పండుగ రోజున అందరూ భక్తి శ్రద్ధలతో ఆ మహాశివుడిని ఆరాధిస్తారు.

అయితే ఈ శివరాత్రి నుంచి కొన్ని అలావాటు చేసుకుంటే మృత్యువుని జయించ వచ్చంట.

శివశక్తుల సమైక్య రూపమే దక్షిణామూర్తి స్వరూపం.  ఆయనను పూజిస్తే మృత్యువును జయించవచ్చు.

దక్షిణామూర్తి విగ్రహంలో కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా ఉంటాయి.

తాటంకం అనేది స్త్రీల అలంకారం, మకర కుండలం అనేది పురుషుల అలంకారం. 

దక్షిణామూర్తి అంటే శివయ్య రూపంతో పాటు, పార్వతి అమ్మ మూర్తి కూడా ఉంటుంది. 

దక్షిణామూర్తి రూపిణీ సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని అని లలితా సహస్రనామంలో ఉంటుంది. 

మృత్యు భయం నుంచి భక్తులను రక్షించబడే దేవుడిగా దక్షిణామూర్తి కొలవబడుతున్నాడు. 

యముడి చేతుల్లో ఉన్న మరణం నుంచి దక్షిణామూర్తి రక్షిస్తారని భక్తుల నమ్మకం.

యమ ధర్మరాజు చూపు మనపై పడకుండా దక్షిణామూర్తి నిత్యం కాపాడతాడని చెబుతారు.

 దుఃఖాలను పూర్తిగా నిర్మూలించే శక్తి దక్షిణామూర్తికి మాత్రమే ఉందని భక్తులు విశ్వాసం. 

వశిష్ఠ్ మహర్షి కూడా దక్షిణామూర్తిని ప్రసన్నం చేసుకుని బ్రహ్మ విద్యను పొందాడు.

అజ్ఞానం వల్లే మనుషులకు శాంతి ఉండదు. ఆర్థిక వైకల్యం, అప్పులు వంటి బాధలు వెంటాడుతుంటాయి.

శివుని రూపమైన దక్షిణామూర్తిని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.

 కాబట్టి ఈ మహా శివరాత్రికి దక్షిణామూర్తి విగ్రహాన్ని గానీ, ఫోటోని గానీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.