ప్రతీ ఒక్క మానిషి సొంతిల్లు ఉండాలని కలలు కంటుంటాడు. సాధారణ వ్యక్తులకే కాక ఈ కల సెలబ్రిటీలకు కూడా ఉంటుంది.
ఇక త్వరలోనే మేం ఓ కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్నాం అని ప్రకటించారు బుల్లితెర స్టార్ కపుల్.
కార్తీకదీపం సీరియల్ తో టీర్పీ రేటింగ్స్ కొల్లగొట్టి బుల్లితెర హీరోగా మారాడు నిరుపమ్. మహిళల్లో అతడి క్రేజ్ మామూలుగా ఉండదు.
కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబుగా నిరుపమ్ కు మంచి గుర్తింపు వచ్చింది.
ఇక అతడి భార్య మంజుల సైతం పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ.. అదరగొడుతోంది.
అయితే సుమారు 18 సంవత్సరాల తర్వాత కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్నాం అని ప్రకటించింది ఈ జోడీ.
ఇంటీరియల్ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి అంటూ కొత్త ఇంట్లో కలియ తిరుగుతూ..వీడియోను పంచుకుంది మంజుల.
ఈ ఇంటిని మా నాన్న బుక్ చేశారు. గతంలో ప్రభుత్వం సినీకార్మికుల కోసం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది అని నిరుపమ్ చెప్పారు.
నాన్న లేకపోవడంతో.. ఆ ఇల్లు నాకు వచ్చింది. అయితే ఆ ఇల్లును బుక్ చేసి దాదాపు 15-18 సంవత్సరాలు కావొస్తోంది.
దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇల్లు పూర్తి అవుతుండటంతో సంతోషంగా ఉందని ఈ జోడీ సంతోషం వ్యక్తం చేస్తోంది.