దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి.
ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న తమ సంప్రదాయాన్ని కన్నడ ఓటర్లు మరోసారి కొనసాగించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల మించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దూసుకెళ్తుంది.
ఇక మరొకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ కొనసాగుతోంది.
ఎన్నికల ఫలితాలపై రూ.20 వేల కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి
ఓ రైతు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని తన రెండెకరాల పొలాన్ని పందెం వేశాడు.
అంతేకాక తాను తన రెండెకరాల పొలం పందెం కాస్తు చాటింపు కూడా వేశాడు.
హొన్నాళి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ గెలుపుపై నాగణ్ణ అనే రైతు పందెం కాశాడు.
కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడంటూ నాగణ్ణ తన రెండెకరాల పొలాన్ని పందేం కాశాడు.
ఈ విషయంలో ఎవరైనా తనతో పందేం కాస్తారా ? అంటూ గ్రామంలో దండోరా వేశాడు.
అలానే కర్ణాటకలో ప్రధాన ప్రాంతమైన చామరాజనగర జిల్లాలో పందేలు జోరుగా సాగుతున్నాయి.
చామరాజనగర లో సోమణ్ణ విజయంపై రూ.కోటి వరకు పందేలు కాశారని సమాచారం.
చామరాజనగర జిల్లా చెందిన కిరణ్ అనే వ్యక్తి కాంగ్రెస్ గెలుస్తుందని రూ.3 లక్షలు పందెం కాశాడు.
కర్ణాటక 16వ శాసనసభ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను మొత్తం 2615 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
ప్రస్తుతం కాంగ్రెస్ 137, బీజేపీ 65 , జేడీఎస్ 20, ఇతరలు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అయితే కాంగ్రెస్ మీద పందెం కాసిన వారికి కాసులు రాగా.. బీజేపీపై పెట్టిన వారికి నష్టం మిగిలింది.