ఇటీవల కన్నడ భాషలో మాత్రమే విడుదలై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన చిత్రం ‘కాంతార’

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన ఈ సినిమా.. తాజాగా తెలుగు భాషలో రిలీజ్ అయ్యింది.

కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం.. తెలుగువారిని ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం!

కథ:  కాంతార చిత్రకథ 1847లో మొదలై.. 1980-1990ల వరకు దశలవారీగా సాగుతుంది.

రాజ్యపాలన చేసే ఓ రాజుకు.. సకల సంపదలు ఉన్నా.. జీవితంలో మనశ్శాంతి లేక మధనపడుతూ అడవిలోకి వెళ్లిపోతాడు.

అడవి ప్రజలు దైవంగా పూజించే ఆ శిలను తీసుకొని.. అడవి మొత్తాన్ని అక్కడి గ్రామస్తులకు రాసిచ్చేస్తాడు. అలాగే రాసిచ్చిన అడవిపై తన కుటుంబీకులకు కూడా అధికారం లేదని మాటిస్తాడు.

కట్ చేస్తే.. 1990ల టైంలో సదరు రాజకుటుంబీకులు మళ్లీ అడవి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు గవర్నమెంట్ వారు అడవి భూమిని సర్వే చేసేందుకు వస్తారు.

నిత్యం ఆ దైవశిలను పూజించే పేద ప్రజలు ఎలా అడవిని కాపాడుకున్నారు? తన గ్రామాన్ని, అడవిని కాపాడేందుకు శివ(రిషబ్ శెట్టి) ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: మన సంస్కృతి, సంప్రదాయాలు.. వాటి మూలాలు.. నాగరికత.. మారుతున్న జీవన విధానాలను అద్దంపట్టే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

అలా ఓ అడవి ప్రాంతంలో నివసించే జనాల సంస్కృతి, సంప్రదాయాలకు.. మాస్ కమర్షియల్ అంశాలు జోడించి తీసిన సినిమా కాంతార.

1847 ప్రాంతంలో అడవి జనాల జీవన విధానాన్ని.. వారి సంస్కృతిని పరిచయం చేస్తూ ఈ సినిమా.. కథ మొదలవుతుంది.

ఆ తర్వాత 1990లో.. హీరో శివ క్యారెక్టర్ లో రిషబ్ శెట్టి మాస్ ఇంట్రడక్షన్.. క్యారెక్టరైజేషన్.. లైఫ్ స్టైల్.. లవ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది.

సెకండాఫ్ లో  శివ లవ్ సీన్స్, అన్నింటిని మించి స్క్రీన్ ప్లే.. రిషబ్ శెట్టి వేరియేషన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకులలో పూనకాలు రావడం పక్కా.

అడవిని కాపాడుకోవాలనే ఓ బలమైన ఎమోషన్ కి.. దైవబలం తోడైతే ఎలా ఉంటుందో క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనలో చూడవచ్చు.

సింపుల్ కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్.. ఇంపాక్ట్ కలిగించే క్యారెక్టర్స్.. వీక్షకులను కదిలించే క్యారెక్టరైజేషన్స్.. అన్ని గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

(ప్లస్ లు)  స్టోరీ, స్క్రీన్ ప్లే, రిషబ్ శెట్టి,   మ్యూజిక్, నిమాటోగ్రఫీ,  ప్రొడక్షన్ వాల్యూస్

(మైనస్ లు)  కొన్నిచోట్ల ప్రెడక్టబుల్ సీన్స్

(చివరమాట)  కాంతార..  ప్యూర్ బిగ్ స్క్రీన్ మ్యాజిక్!

రేటింగ్: 3/5