తెర మీద అందంగా కనిపించే నటీనటుల జీవితాల వెనుక ఎన్నో విషాద గాధలున్నాయి.
కొన్ని స్వయం కృపరాధం కారణంగా, కొన్ని పరిస్థితుల ప్రభావం వారిని కష్టాల కడలిలోకి ముంచేస్తాయి.
వారు జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కష్ట సుఖాలతో ఓ సినిమా తీయొచ్చు. అటువంటి వారిలో నటి అంజు అలియాస్ అంజు ప్రభాకర్.
చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించారు. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించారు.
కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, మోహన్ బాబు, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి స్టార్ల సినిమాల్లో నటించారు
భలే నాగమ్మ, కోడే త్రాచు, అగ్నిపూలు వంటి తదితర తెలుగు సినిమాలతో మెప్పించారు. తెలుగు డబ్బింగ్ ఓ పాప లాలీలో చిన్నప్పటి క్యారెక్టర్ ఆమెనే పోషించారు.
ఆ తర్వాత హీరోయిన్‌గా మారి గ్లామరస్ రోల్స్‌లో కూడా కనిపించారు. అయితే తెలుగులో చివరిసారిగా శేషు మూవీలో రాజశేఖర్ వదిన పాత్రలో నటించారు.
నటిగా బిజీగా ఉన్న సమయంలోనే తెలుగు, కన్నడలో స్టార్ విలన్ కన్నడ ప్రభాకర్‌ను అలియాస్ టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకున్నారు.
కన్నడలో నటించేందుకు వెళ్లిన అంజును తాను పెళ్లి చేసుకుంటానంటూ కన్నడ ప్రభాకర్.. తన సన్నిహితుల ద్వారా అడిగించారట.
ఆయనకు అప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా, ఈ విషయాన్ని దాచి.. ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ తెచ్చారు. అయితే అంజు ఈ విషయాన్ని పేరెంట్స్‌తో చెప్పారు.
అంజు తల్లి కన్నడ ప్రభాకర్‌ను చూసి షాక్ తిన్నారు. వయస్సులో తన తండ్రి కన్నా పెద్దవాడిని పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ.. ఆయన పెళ్లి చేసుకోవాలని అడిగిన తీరుకు మెచ్చిన అంజు.. కన్నడ ప్రభాకర్‌ను పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయ్యి కొన్ని నెలలు గడిచిన తర్వాత.. ఆమెకు అసలు విషయం తెలిసింది. అయితే అప్పటికే అంజు ప్రెగ్నెంట్
వీరు తన మాజీ భార్యల పిల్లలు అని చెప్పడంతో.. ఆమెకు ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు
నమ్మక ద్రోహం చేశావని ప్రశ్నించినందుకు అంజుపై నెగిటివిటీ తీసుకు వచ్చారు కన్నడ ప్రభాకర్
దీంతో విడిపోవాలని భావించి.. ఇంట్లో నుండి వచ్చే సమయంలో ’తిరిగి ఈ ఇంటికి రాను. నేను చనిపోయినా, నువ్వు చనిపోయినా.. తిరిగి నీ ముఖం నేను చూడాలనుకోవడం లేదు‘ అని చెప్పారట.
అందుకే కన్నడ ప్రభాకర్ చనిపోయిన సమయంలో కూడా కడసారి చూపుకు కూడా ఆమె వెళ్లలేదు. ప్రస్తుతం ఆమెకు ఓ కొడుకు ఉన్నారు. సీరియల్స్, సినిమాలు చేస్తున్నారు.
ఈ విషయాలన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.