సుమారు 60 ఏళ్ల పాటు.. 200 మంది పైచిలుకు దర్శకుల డైరెక్షన్‌లో.. సుమారు 700 వందలకు పైగా చిత్రాల్లో నటించి నవరస నటనా సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కైకాల సత్యనారాయణ.

ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా. 1935, జూలై 25న కౌతారం గ్రామంలో జన్మించారు కైకాల సత్యనారాయణ.

గుడ్లవల్లేరులో హైస్కూల్‌ చదువు.. విజయవాడ, గుడివాడలో ఇంటర్‌,  గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు కైకాల.

చిన్నప్పటి నుంచి ఆయనకు నాటకాలంటే ఇష్టం. ఇంటర్‌ చదివే రోజుల నుంచే నాటకాల్లో నటిస్తుండేవారు

1965లొ డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగం రాకపోవడంతో.. కొన్నాళ్లు.. రాజమండ్రిలోని వారి కలప వ్యాపారం చూసుకున్నారు.

ఆ తర్వాత ఓ మిత్రుడి సలహాతో.. సినిమాల్లో నటించేందకు మద్రాస్‌ వెళ్లారు కైకాల.

ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో.. సహాయ కళా దర్శకుడిగా కైకాల సినీ కెరీర్‌ ప్రారంభం అయ్యింది.

ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్‌, కేవీ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది.

ఆ తర్వాత నిర్మాత డీఎల్‌ నారాయణ తెరకెక్కించిన సిపాయి కూతురు.. చిత్రంలో కైకాలకు అవకాశం ఇచ్చింది.

ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించకపోవడంతో.. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు లభించలేదు.

దాంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా నటించారు.

ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన కనకదుర్గ పూజా మహత్యం.. సినిమా కైకాల కెరీర్‌ను మలుపు తిప్పింది.

ఆ తర్వాత ఆయన వరుసి చిత్రాల్లో నటిస్తూ.. ఏడాదిలోనే స్టార్‌ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎస్వీఆర్‌ తర్వాత.. ఆ తరహా పాత్రలన్ని.. కైకాల నటించారు.

కైకాల తన కెరీర్‌లో  28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు.

కైకాల నటించిన చిత్రాల్లో 220 పైగా సినిమాలు.. 100 రోజలుకు పైగా.. 59 సినిమాలు 50 రోజులకు పైగా నడిచాయి. మరో 10 సినిమాలైతే ఏకంగా ఏడాది పాటు నడిచాయి.

1994లో బంగారు కుటుంబం సినిమాలో నటనకుగాను కైకాల నంది అవార్డు గెలుచుకున్నారు.

 అలానే 2011లో కైకాల.. రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.

ఇండస్ట్రీకి కైకాల చేసిన సేవలను గుర్తిస్తూ..  2017లో ఆయనకు ఫిల్మ్‌ ఫెయిర్‌ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

అలానే పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్‌ ప్రకటించింది.

రాజకీయాల్లోకి ప్రవేశించిన కైకాల.. 1996లో మచిలీపట్నం నుంచి టీడీపీ తరఫున ఎన్నికల్లో విజయం సాధించారు.

సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ వరకు మూడు తరాల హీరోలతో నటించారు కైకాల.

సుయోధనుడు, ఘటోత్కచుడు, యముడు పాత్రలకు ప్రాణం పోశారు కైకాల.

కైకాల భార్య నాగేశ్వరమ్మ.. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం.

కైకాల 87 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు