సునిశిత్ గురించి టక్కున గుర్తుకు వచ్చేది.. సినిమా సెలబిట్రీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు.

ఫేమస్ అయ్యేందుకు ఏకంగా నోటికొచ్చిన అబద్దాలు చెబుతాడు. 

మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు  తానే మొదట హీరోనని, ఆ తర్వాత మహేష్ బాబుకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ శాక్రిఫైజ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. 

లావణ్య త్రిపాఠి, తాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని వ్యాఖ్యలు చేయడంతో ఆమె కేసు కూడా పెట్టింది.

అయితే తొలుత ఆయన చెప్పేవన్నీ సొల్లు కబుర్లు అని తెలిసి కూడా నవ్వుకున్నారు నెటిజన్లు. 

అయితే ఇప్పుడు సునిశిత్ నోటి దూల హద్దు దాటి పోతుంది. ఏకంగా రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనపై లేని పోని కామెంట్లు చేయడంతో చితకబాది,  డబ్బులు ఇచ్చారు

ఆయన ఫ్యాన్స్. అది చాలలేదన్నట్లు తారక్, ప్రభాస్ స్టార్ నటులపై కూడా కామెంట్లు చేశాడు.

ఇటీవల రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో తన్నులు తిన్న సునిశిత్.. అంతటితో ఆగలేదు.. ఎన్టీఆర్ గురించి పిచ్చి వాగుడు అంతా వాగాడు.

 జూనియర్ ఎన్టీఆర్ తనకు ఫ్రెండ్ అని, ఆయన ఇప్పుడు పెద్ద హీరో అయినప్పటికీ.. గతంలో కొన్ని పోర్న్ సినిమాల్లో నటించాడంటూ వ్యాఖ్యలు చేశారు. 

నిజాన్ని బయటికి చెప్పే ధైర్యం తనకు తప్ప మరెవ్వరికీ లేదని అన్నాడు.  అయితే ఈ వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది.

దీంతో ఈ సారి ఏ స్థాయిలో దంచుడు ఉంటుందో అనుకుంటూ.. దొరికితే నీకు ఉతుకుడే అంటూ  కామెంట్లు చేశారు. 

ఈ విషయం ముందే గ్రహించిన సునిశిత్.. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టవద్దని, తారక్ పై చేసిన కామెంట్లకు క్షమాపణలు చెబుతున్నానని, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పాడు. 

అయితే, మొత్తానికి సునిశిత్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టేశారు. అయితే  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన్నలేదట. అయితే ట్రీట్ మెంట్ మాత్రం ఇచ్చారట.

అదే తిట్టినోడి చేత.. హారతి పట్టించారట. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటాన్ని తీసుకొచ్చి.. కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి హారతి ఇచ్చిన సునిశిత్.. ఆ తరవాత దిష్టితీసిన ఆ కొబ్బరికాయను నేలకేసి కొట్టారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘తిట్టినోడి చేతే హారతి ఇప్పించారు.. అదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే’ అని అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. 

ఈ వీడియోలో ఒకరు మాట్లాడే మాటలు గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. అది కొంచెం రాకేష్ మాస్టర్ వాయిస్ ను పోలి ఉంది. 

ఆ వాయిస్ ‘గు గుతాబీపువ్వు అయిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే’ అనడం వీడియోలో వినొచ్చు.