సినిమా హీరోలు, క్రికెటర్లుకి అభిమానులు, ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు.

వారి అభిమాన హీరో, క్రికెటర్ ఇలా సెలబ్రిటీలు ఏం చేసినా, ఏం ధరించినా వీళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు.

వాళ్లు ఏం దుస్తులు ధరించారు, ఏ వాచెస్ వాడుతున్నారు? ఎలాంటి యాక్ససరీస్‌ ధరిస్తారో ఫాలో అవుతుంటారు.

దాదాపుగా తమ అభిమాన హీరోలు ధరించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు.

ఇప్పుడు తారక్ అభిమానులు అదే పనిలో ఉన్నారు. Jr NTR ధరించిన ఒక హుడీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

తారక్ తాజాగా విశ్వక్ సేన్‌ సినిమా దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ ఒక బ్లాక్ హుడీ ధరించాడు.

ఆ హుడీపై వైట్ కలర్‌ ఫ్లేమ్స్ కూడా ఉన్నాయి. అది యునిక్ గా ఉండటమే కాదు.. అభిమానుల దృష్టిని ఆకట్టుకుంటోంది.

జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులు అంతా ఇప్పుడు ఆ హుడీ కోసం వెతుకులాట మొదలు పెట్టారు. 

ఆ హుడీ చూడటానికి బ్లాక్ కలర్ పై వైట్‌ కలర్‌ ఫైర్‌ గ్రాఫిక్ డిజైన్ తో ఎంతో డిఫరెంట్ గా ఉంది.

పైగా ఈ హుడీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. బ్లాక్‌ అండ్ ఆరెంజ్ కూడా అందుబాటులో ఉంది.

ఈ హుడీ ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

హుడీ ధర విషయానికి వస్తే.. 170 యూరోస్ గా ఉంది. అంటే దాదాపుగా మన కరెన్సీలో రూ.15 వేలు వరకు ఉంటుంది.

ఇలా తారక్ ధరించిన హుడీ ధర తెలుసుకుని అభిమానులు ఒకవైపు షాకవుతూనే.. మరోవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంక ఆర్‌ఆర్ఆర్‌ సినిమాతో రాజమౌళి- తారక్- రామ్ చరణ్‌ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగుతున్నాయి.