ప్రారంభంలో అన్నీ ఫ్రీ.. అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి..
టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.
అయితే,.. గతేడాది నవంబర్ నెలలో అన్నిటెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా బెనిఫిట్స్ తగ్గించి టారీఫ్ ధరలను పెంచేశాయి.
టెలికాం కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయంతో.. రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.
యూజర్ల ఆలోచన ఇప్పుడే ఒకే విధంగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఏ కంపెనీ ఇస్తుందా అని ఆలోచిస్తుంటారు.
అంతే.. ఒక్కసారిగా జియో యూజర్లందరూ ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ వైపు పరుగులు తీశారు. దీంతో యూజర్ల దెబ్బకు దిగొచ్చిన జియో సరికొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చింది.