ప్రముఖ టెలికాం సంస్థ జియో మరోసారి ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను   పెంచుతూ వినియోగదారులకు  షాక్ ఇచ్చింది.

ఇప్పటకే ప్రముఖ టెలికాం  సంస్థలైన ఎయిర్ టెల్, వొడాఫోన్  ఐడియా 25 శాతం మేర ధరలను  పెంచిన విషయం  తెలిసిందే.

 తాజాగా ఇదే దారిలో వెళ్లింది జియో. ఇక జియోకు సంబంధించి అన్ని రకాల అన్ లిమిటెడ్ ధరలను 21 శాతానికి  పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ నుంచి పెరిగిన ప్రీపెయిడ్  ప్లాన్ల ధరలు అమల్లోకి రానుందని జియో   తన ప్రకటనలో తెలిపింది.  తాజాగా జియో పెంచనున్న ధరలు  వివరాలను చూసుకుంటే

ప్రాథమిక ప్లాన్‌కు రూ.75 బదులు డిసెంబర్ 1 నుండి రూ.91 చెల్లించాలి.  రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌ లు 28 రోజుల  వ్యాలిడిటీతో వచ్చే రూ.149 ప్లాన్  రూ.179కు చేరింది. 

అలాగే రూ.199 ప్లాన్ (28 రోజులకు   1.5GB/రోజుకు) ధరను రూ.239కు   పెంచింది.  రోజుకు 2జీబీ లభించే ప్లాన్   రోజుకు 2జీబీ లభించే ప్లాన్ రూ.249 నుంచి రూ.299కి చేరింది.

దీంతో పాటు రూ.444 ప్లాన్‌కు రూ.533,   రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున  చెల్లించాలి.   ఇక తాజాగా పెంచిన వార్షిక ప్లాన్ల  విషయానికి వస్తే..

336 రోజుల వ్యాలిడిటీతో రోజుకు  2జీబీ డేటా,అపరిమిత కాల్స్, రోజుకు  100 ఎస్ఎంఎస్‌‌లు వచ్చే ప్లాన్ ధర  రూ.2,399 నుంచి రూ.2,879కి పెరిగింది. 

365 రోజుల కాలపరిమితితో 24జీబీ డేటా,  అపరిమిత కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌‌లు  లభించే  రూ.1299 ప్లాన్ రూ.1559కి  చేరింది.

ప్రస్తుతం ఉన్న టారీఫ్ ధరలను  చూసుకుంటే ఈ ధరలతో కంపెనీలు  ముందుకు నడవలేవని కంపెనీలు  తెలుపుతున్నాయి.

 దీని కారణంగానే అన్ని ప్రముఖ టెలికాం  సంస్థలు పోటిపడుతూ చార్జీలు  పెంచేందుకు మొగ్గు చూపినట్లు  తెలుస్తోంది.