మనలో చాలామందికి క్రికెట్ లేదా సినిమా అంటే చాలా ఇష్టం. కొందరైతే ఈ రెండింటిని ఇష్టపడుతుంటారు.
ఇక సినిమాకు వెళ్లాలని టికెట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా సరే ఓటీటీ యాప్స్ ఉండాలి.
ఇక మనలో చాలామంది ఐపీఎల్ ని బాగా ఇష్టపడుతారు. ప్రతి ఏడాది ఈ టోర్నీని టీవీ, మొబైల్లో చూస్తుంటారు. గత కొన్నేళ్ల నుంచి ఇదే జరుగుతోంది.
2008లో స్టార్ట్ అయిన ఐపీఎల్ ని మొదట్లో అందరూ కూడా టీవీల్లోనే చూసేవారు. అప్పట్లో సోనీ మాక్స్ ఛానెల్ మ్యాచుల్ని ప్రసారం చేసింది.
ఆ తర్వాత టెక్నాలజీ పెరగడం, ఓటీటీ కల్చర్ బాగా అలవాటు పడటంతో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్, హాట్ స్టార్ యాప్ లో అందరూ మ్యాచులు చూస్తున్నారు.
ఇప్పటివరకు హాట్ స్టార్ లో వచ్చిన మ్యాచులు ఇకపై రియలన్స్ కు సంబంధించిన కొత్త యాప్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఎందుకంటే వచ్చే ఐదేళ్ల కాలానికాగానూ అంటే 2023-27కు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని రిలయన్స్ కు చెందిన వయకామ్ 18 సంస్థ దక్కించుకుంది.
దీనికోసం ఏకంగా రూ.23, 773 కోట్లు పెట్టింది.
ఇక ఐపీఎల్ ప్రేమికుల కోసం రిలయన్స్ సంస్థ ఈసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది
సీజన్ లోని అన్ని మ్యాచుల్ని ఫ్రీగా చూసే ఛాన్స్ కల్పించనుందని తెలుస్తోంది.
మొత్తంగా 11 భాషల్లో జియో సినిమా, జియోటీవీ యాప్స్ లో జియో సిమ్ యూజ్ చేస్తున్నవారు.. ఈసారి ఐపీఎల్ అన్ని మ్యాచులు ఉచితంగా చూడొచ్చట.
గతంలో హాట్ స్టార్ లో నెలకు రూ.99 కడితేనే మ్యాచులు చూసే వీలుండేది. ఇప్పుడు రిలయన్స్ మాత్రం సీజన్ మొత్తం ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పించనుంది.
అయితే గతంలో జియో సిమ్ లాంచ్ చేసినప్పుడు.. తొలుత కాల్స్, డేటాని ఫ్రీగా ఇచ్చింది. బాగా అలవాటు పడిన తర్వాత డబ్బులు వసూలు చేసింది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఐపీఎల్ విషయంలో యూజ్ చేయాలని రిలయన్స్ సంస్థ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ఈ సీజన్ లో మ్యాచులు ఫ్రీగా చూడొచ్చు కానీ వచ్చే ఏడాది నుంచి మాత్రం భారీగా డబ్బులు వసూలు చేయొచ్చని టాక్ కూడా వినిపిస్తుంది.
మరి ఐపీఎల్ మ్యాచులు ఫ్రీగా చూసే అవకాశం విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.