సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జపాన్ రాకుమారి మకో పెళ్లి గురించే ప్రస్తావన

ప్రియుడి కోసం రాచరికం వదులుకుందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 ప్రేమించిన వాడికోసం జపాన్ రాకుమారి మకో రాచరికం వదులుకోవడమే కాదు.. రాజ భరణంగా వచ్చే రూ.10 కోట్లు కూడా వద్దంది.

జపాన్ రాకుమారి మకో, ఆమె ప్రేమించిన కీ రొమురో వివాహం ఎలా జరిగిందో చూద్దాం.

రాజప్రాసాదాలు, రాచరికం, భోగభాగ్యాలను కాదని.. కోరిన వ్యక్తిని పెళ్లాడిని సామాన్యుడి ఇంటి కోడలిగా వెళ్లిపోయింది.

ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఎంతో సింపుల్గా వివాహం చేసుకుంది జపాన్ రాకుమారి మకో.

దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత తాను ప్రేమించిన కీ కొమురోను వివాహం చేసుకుంది జపాన్ రాకుమారి మకో.

ఆ విషయాన్ని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అధికారికంగా ధృవీకరించింది.

2017లోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు మకో- కొమురో ప్రకటించారు. కానీ ఆసమయంలో కొమురో తల్లి కారణంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

ఆ కారణంతో అప్పుడు వారి వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత 2018లో కొమురో లా చదివేందుకు న్యూయార్క్ వెళ్లిపోయారు.

 అప్పటి నుంచి మూడేళ్లపాటు జపాన్కు తిరిగి రాలేదు. అందుకే వీరి వివాహం ఇన్నాళ్లు వాయిదా పడింది.

నెలక్రితం కొమురో జపాన్ తిరిగి రావడంతో వీరి వివాహం ప్రస్తావన మళ్లీ వచ్చింది.

కొమురో తల్లి పేరిట ఉన్న ఆస్తి వివాదాలపై స్పష్టత ఇవ్వాలని మకో తండ్రి కోరారు. అందుకు కొమురో హామీ ఇవ్వగా వీరి వివాహం జరిగింది.

వీరి వివాహానికి మెజారిటీ ఆమోదం తెలపకపోవడంతో ఎలాంటి హడావుడి లేకుండానే వివాహం జరిపారు.

పెద్దగా ఏర్పాటు ఏమీ చేయకపోయినా అధికారికంగా పత్రాలు విడుదల చేశారు. 

జపాన్లో రాజ కుటుంబం మహిళలు సామాన్యులను వివాహం చేసుకుంటే రాజరికాన్ని వదులుకోవాలి.

భరణంగా వారికి 150 మిలియన్ యెన్లు (రూ.10 కోట్లు) ఇస్తారు. అయితే మకో ఆ రాజభరణాన్ని సైతం కాదనుకుని వెళ్లిపోయింది.

జపాన్ చక్రవర్తి నరుహిటో సోదరుడు అకిషినో కుమార్తె మకో. 

చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకుని.. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.