'జబర్దస్త్'లో కమెడియన్ గా ఎంటర్ టైన్ చేస్తున్న రోహిణి సడన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది.

ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. స్వయంగా ఆమెనే పోస్ట్ పెట్టేసరికి ఏమైందా అని ఆరా తీస్తున్నారు.

దీంతో ఇన్నిరోజుల నుంచి తనకున్న కష్టాలను, భరిస్తూ మనల్ని నవ్విస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు.

'జబర్దస్త్'లో కామెడీ పరంగా ఫుల్ గా అల్లరి చేస్తూ నవ్విస్తూ వచ్చిన రోహిణికి అసలు ఏమైంది?

'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ తో నటిగా పరిచయమైన రోహిణి.. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని చాలా ఫేమ్ తెచ్చుకుంది. 'జబర్దస్త్'లో కమెడియన్ గా ఇంకా పేరు సంపాదించింది.

ఓవైపు టీమ్ లీడర్ గా చేస్తూనే, మరోవైపు సినిమాల్లో మంచి కామెడీ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

రీసెంట్ గా 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ లోనూ పనిమనిషి రోల్ లో నటించి అందరిని తెగ నవ్వించింది.

అలాంటి రోహిణి సడన్ గా ఆస్పత్రిలో పేషెంట్ గా కనిపించేసరికి షాకయ్యారు. ఆ పరిస్థితి చూసి చలించిపోయారు.

2016 లో పుష్కరాలకు వెళ్తున్న టైంలో రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. కాలు ఫ్రాక్చర్ అయ్యింది.

దీంతో అప్పట్లోనే రోహిణి కాలికి సర్జరీ చేసి రాడ్ బిగించారు. అప్పటి నుంచి అది అలానే ఉండిపోయింది.

అలా రాడ్ బిగించినప్పటికీ షోల్లో డ్యాన్సులు వేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది.

తాజాగా ఆ రాడ్ తీయించాలని రోహిణి.. డాక్టర్ల దగ్గరికి వెళ్లింది. కానీ తీయడం కుదరదని వాళ్లు చెప్పారు.

ఎముక లోపల రాడ్  కూరుకుపోయిందని వైద్యులు రోహిణితో చెప్పారు. రాడ్ తీస్తే ఎముక పాడయ్యే ఛాన్స్ ఉందన్నారు.

రాడ్ ని బయటకు తీయడం కంటే అలా వదిలేయడం మంచిదని 'జబర్దస్త్' రోహిణికి సలహా ఇచ్చారు.

అనవసరంగా ఆస్పత్రికి వెళ్లాలని ఇప్పుడు రోహిణి బాధపడుతోంది. ఆమె ఫాలోవర్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.