మంచి పని చేసినందుకు వ్యక్తికి శిక్ష వేసిన అధికారులు!

చేసిన మంచి పనిని బట్టి.. పెద్దదైతే సన్మానాలు, సత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి.

అయితే, ఓ వ్యక్తి తాను చేసిన మంచి పనికి గాను శిక్ష అనుభవించాడు.

భారీ ఫైన్‌తో పాటు పోలీసులతో మెట్టికాయలు వేయించుకున్నాడు.

ఇటలీకి చెందిన క్లాడియో ట్రెంటా వ్యక్తి రోడ్డుపై వెళుతుండగా ఓ గుంత కనిపించింది.

వాహనదారులు ఆ గుంత కారణంగా ఇబ్బంది పడటం అతడు గమనించాడు.

ఆ గుంత కారణంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా దాన్ని కప్పెట్టేశాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

పోలీసులు అతడికి నోటీసులు పంపారు.

రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చటం హైవే కోడ్‌ ప్రకారం నేరమని నోటీసులు పేర్కొన్నారు.

ఇందుకు గాను 80 వేల ఫైన్‌తో పాటు పూడ్చిన గుంతను యధా స్థితిలోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఆ వ్యక్తి పైన్‌ కట్టి.. గుంతను యధాస్థితిలోకి తీసుకువచ్చాడు.