తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అకాల వర్షాలు దంచికొడుతున్నాయి.

మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఉదయం ఎండ, సాయంత్రం వర్షం అన్నట్లు తయారైంది.

లోతట్టు ప్రాంతాలు చాలావరకు జలమయం అవుతున్నాయి. బయటకెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇలాంటి విచిత్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా బయటకెళ్లడానికి ప్రజలు ముందు వెనక అవుతున్నారు.

అదే టైంలో వెదర్ మొత్తం కూల్ గా తయారవుతుంది కాబట్టి బజ్జీలు, పకోడీ లాంటివి తినాలనుకుంటారు.

కానీ నిపుణులు చెప్పిన దానిబట్టి.. వాన పడేటప్పుడు కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిదట.

వర్షాలు పడుతున్నాయి కాబట్టి.. ఉడికించిన పల్లీలు, నానబెట్టి లేదా ఉడికించిన పప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మొక్కజొన్న, కీరదోస, తీగల కూరగాయలు, వేర్లతో ఉండే కూరగాయల్ని వారంలో 2-3 సార్లయినా తీసుకోవాలట.

ఇలా వర్షాలు పడేటప్పుడు చామదుంపల ఫ్రై చేసుకుని తిన్నాసరే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

దీనికోసం ముందుగా చామదుంపల్ని కుక్కర్ లో ఉడికించాలి. ఆ ముక్కలకు ఉప్పుకారం దట్టించి టాస్ చేస్తే సరిపోతుంది.

మనం రెగ్యులర్ గా చేసే పప్పు కాకుండా గోంగూరతో పప్పు చేసుకుని తినడం.. ఇలాంటి వర్షాల టైంలో మంచిదట.

వినాయక చవితికి మనం కుడుములు తయారు చేస్తుంటాం. కానీ వర్షాలు పడే టైంలోనూ వీటిని తినడం చాలా మంచిదట.

నెయ్యిలో బెల్లం, కొబ్బరి తురుము, నట్ మెగ్, యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని స్టఫ్ కింద పెట్టుకోవాలి.

వరి పిండితో పిండి కలుపుకొని.. వీటిని మోదకాల్లా చేసుకోవాలి. దీనిలో స్టఫ్పింగ్ చేసి 15-20 నిమిషాలు ఆవిరిపై ఉంచితే సరి.

ఇలా పైన చెప్పిన అన్ని రెసిపీస్ ని మన ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు. వీటి వల్ల వర్షాల టైంలో ఆరోగ్యంగా ఉంటాం.