నేటికాలంలో ఎక్కువ మంది పిల్లలు  సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు.

అయితే  ఈ సోషల్ మీడియాను  సరైన విధంగా ఉపయోగించుకుంటే మంచిదే.

సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగిస్తే పిల్లల నైపుణ్యాభివృద్ధికి సహాయపడుతుంది.

అయితే పిల్లలకి సోషల్ మీడియా ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియా ద్వారా పిల్లలు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి అవకాశాలు  ఎక్కువ. 

అయితే తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పర్యవేక్షించాలి. 

సోషల్ మీడియాలో షేర్ చేసే వ్యంగ్య, వక్రబుద్ధి పోస్టుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలి. 

మంచి స్నేహాన్ని పెంపొందించుకోవడానికి సోషల్ మీడియా సహాయపడుతుంది.

అయితే ఈ సోషల్ మీడియాలో ఏర్పడే స్నేహాలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది సోష‌ల్ మీడియా ద్వారా పిల్లలకు తెలుస్తోంది.

పిల్లలు ఇంటర్నెట్‌ను ఉపయోగించినప్పుడు, వారి జ్ఞానాన్ని పెంపొందించుకుని అవకాశం ఉంది.

ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఒక అవకాశం.

సోషల్ మీడియా పిల్లలలో ప్రగతిశీల ఆలోచనను పెంపొందించడానికి సహాయపడుతుంది. 

ఇది వాస్తవ ప్రపంచ సమస్యలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

పిల్లలు సోషల్ మీడియాలో ద్వారా తమ నైపుణ్యాలను బయటి ప్రపంచానికి చూపగలరు .

అయిన సోషల్ మీడియా పట్ల పిల్లలు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.