ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ!  ఫోర్లు, సిక్సుల వర్షం..

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఘోర అవమానం  ఎదుర్కొన్న భారత జట్టు.. మూడో వన్డేలో  మాత్రం పరుగుల వరద పారిస్తోంది.

ముఖ్యంగా యంగ్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌  ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 

గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటర్లను  ఇబ్బంది పెట్టిన బంగ్లా బౌలర్లను చాలా  సులువుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సులతో  విరుచుకుపడ్డాడు.

తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకున్న ఇషాన్‌.. సెంచరీతో బంగ్లాపై  బెబ్బులిలా చెలరేగాడు.

వన్‌ డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లీ.. ఇషాన్‌  కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు  నడిపించాడు.

ఇషాన్‌ కిషన్‌ మంచి షాట్లతో చెలరేగుతుంటే..  కోహ్లీ యాంకర్‌ రోల్‌ ప్లే చేస్తూ.. కిషన్‌కు  ఎక్కువగా స్ట్రైక్‌ ఇచ్చాడు.

తాను బాల్‌ టూ బాల్‌ సింగిల్స్‌ రోటేట్‌ చేస్తూ..  మరో వికెట్‌ పడకుండా.. జాగ్రత్త పడ్డాడు.

కోహ్లీ సపోర్ట్‌తో మరో ఎండ్‌లో చెలరేగిపోయిన  ఇషాన్‌ కిషన్‌.. కేవలం 85 బంతుల్లోనే  14 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఇషాన్‌..  103 బంతుల్లో 150 మార్క్‌ అందుకున్నాడు.

సెంచరీ మార్క్‌ అందుకునేందుకు 85 బంతులు  తీసుకున్న ఇసాన్‌.. 150 మార్క్‌ చేరుకునేందుకు  కేవలం 18 బంతులు మాత్రమే తీసుకున్నాడు.

126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్సులతో  డబుల్‌ సెంచరీ సాధించాడు.

131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సులతో  210 పరుగులు చేసిన ఇషాన్‌..

టాస్కిన్‌ అహ్మెద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌  5వ బంతికి లాంగ్‌ఆన్‌లో లిట్టన్‌ దాస్‌ అద్భుత  క్యాచ్‌కు అవుట్‌ అయ్యాడు.

కిషన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై క్రికెట్‌ అభిమానులు  ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా  సీనియర్‌ క్రికెటర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇషాన్‌ను చూసి బంగ్లా లాంటి పిసికూనపై  ఎలా ఆడాలో నేర్చుకోవాలని  హితవు పలుకుతున్నారు.