కానీ, శరీరంలో జరిగే మార్పుల వల్ల నాలుక రంగు మారుతుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అసలు నాలుక రంగు మారడం దేనికి సంకేతం? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు రంగులో ఉన్న నాలుక అప్పుడప్పుడు రంగు మారడం సహజం.
అలా రంగు మారితే మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు.
నాలుకపై తెల్లటి పూత కనిపిస్తే.. నోరు శుభ్రంగా ఉంచుకోవడం లేదని అర్థం.
రోగ నిరోదక శక్తి తక్కువగా ఉన్నప్పుడు నాలుకపై బాక్టీరియా ప్రభావం చూపిస్తుందట.
ఇది ఎక్కువగా కనిపిస్తే.. ఫ్లూ ఇన్ఫక్షన్ కు కూడా దారి తీయొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
క్యాన్సర్, అల్సర్ సమస్యతో బాధపడేవారి నాలుక ఇలా తెలుపు పూత ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
మరో విషయం ఏంటంటే? అల్కహాలు ఎక్కువగా, సిగరెట్ ఎక్కువగా తాగడం, నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడంతో కూడా ఇలా నాలుకపై తెల్లటి పొర వస్తుందని చెబుతున్నారు.
ఒకవేళ నాలుకపై పూత కాటేజ్ చీజ్ లా కనిపిస్తే మాత్రం.. అది ల్యూ ప్లాకియాని కలిగి ఉండే అవకాశం ఉంటుందట.
నీరు అధికంగా తీసుకోడం ద్వారా నాలుకపై ఏర్పడే ఇలాంటి తెలుపు పూతను కొంతైన అరికట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.