విరాట్ కోహ్లీ.. టీమిండియాకి దొరికిన ఓ వజ్రాయుధం అలాంటి  ఆటగాడు. గత దశాబ్ద కాలంగా కోహ్లీ క్రికెట్ ని శాసిస్తూ..  కింగ్ కోహ్లీగా ఎదుగాడు.

కెప్టెన్ గా టీమిండియాకి చాలా విజయాలను అందించాడు.

కానీ.., తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేకపోవడమే కోహ్లీ కొంప ముంచింది.

 ఇప్పుడు అదే కోహ్లీ వన్డే కెప్టెన్సీ పోవడానికి కారణం అయ్యింది.

ఈ నిర్ణయంపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గొప్ప ఆటగాడిని, టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ను  ఈ విధంగా అవమానిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. 

అటు విరాట్ కోహ్లీ కూడా ఈ విషయంపై తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోచ్ ద్రావిడ్, బీసీసీఐ కార్యదర్శి జైషా తనను ఘోరంగా అవమానించారని విరాట్ బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

 ఇక వన్డే కెప్టెన్ గా తనను తొలగించడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్న కోహ్లీ.. సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి మూడు టెస్టుల తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

ఈ సిరీస్ కు తప్పుకుని విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరుకోనున్నాడు. కానీ.., ఈ బ్రేక్ కేవలం సౌత్ ఆఫ్రికా టూర్ వరకేనా?

  లేక.. కోహ్లీ పూర్తిగా వన్డే క్రికెట్ నుండి తప్పుకోనున్నాడా అన్న అనుమానాలు కూడా ఆయన సన్నిహితుల నుండే వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే.. 2023 లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ని కోహ్లీ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. నిజానికి ఇందుకోసమే ఐపీఎల్ లో కెప్టెన్సీని వదులుకున్నాడు.

 టీమిండియా టీ20 కెప్టెన్సీ ని వదులుకున్నాడు. ఇలా అన్నీ విధాలా 2023 వరల్డ్ కప్ కోసం తనని తాను సిద్ధపర్చుకుంటున్న వేళ బోర్డు పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కోహ్లీని షాక్ కి గురి చేసిందట.

దీంతో.., కోహ్లీ వన్డే ల నుండి వైదొలగాలని కూడా ఆలోచన చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా సౌత్ ఆఫ్రికా సిరీస్ అయ్యాకనే ఈ విషయంలో కోహ్లీ నుండి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

 మరి.. ఈ విషయంలో కోహ్లీకి అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.